పాన్ ఇండియా లెవల్లో రామ్ చరణ్ క్రేజ్ మామూలుగా లేదు. ఆ విషయం అందరికి తెలుసు.. అయితే ఇతర ఇండస్ట్రీ స్టార్స్ కూడా చరణ్ క్రేజ్ ను చూసి షాక్ అయిన సంఘటన వైజాగ్ లో జరిగింది. ఇంతకీ విషయం ఏంటంటే..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వాని నటిస్తోంది. ఆమె చరణ్ తో రెండో సారి జతకట్టింది. ఇక ఈమూవీలో వీరితో పాటు తమిళ స్టార్ డైరెక్టర్, అందు యాక్టర్ ఎస్ జే సూర్య , అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునిల్ లాంటి స్టార్స్ నటించారు. ఇక ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం చివరిదశలో ఉంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ కోసం వైజాగ్ చేరారు టీమ్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు మూవీ లో నటిస్తున్న మెయిన్ తారాగణం వైజాగ్ లో వాలిపోయారు. కాగా ఈ మూవీ షూటింగ్ నేటి (మార్చి 15) నుంచి వైజాగ్ లో జరగనుంది. అక్కడి ఆర్‌కె బీచ్ లో ఐదు రోజుల పాటు కీలక షెడ్యూల్ జరగబోతుంది. ఈక్రమంలోనే బీచ్ పెద్ద పొలిటికల్ మీటింగ్ సెట్ ని కూడా నిర్మించారు. ఇక ఈ షూటింగ్ కోసం మూవీ టీం అంతా నిన్ననే వైజాగ్ చేరుకుంది.
రామ్ చరణ్, శంకర్, ఎస్‌జె సూర్యతో పాటు ఈ షెడ్యూల్ లో పాల్గోవల్సిన మరికొందరు నటీనటులు కూడా వైజాగ్ చేరుకున్నారు. ఇక రామ్ చరణ్ వస్తున్నాడు అని తెలియడంతో.. ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చాయి. వైజాగ్ లో ఎక్కడెక్కడినుంచో అభిమానుల సందడి మొదలయింది. నిన్న సాయంత్రం నుంచి వైజాగ్ ఎయిర్ పోర్ట్ వద్ద మెగా అభిమానులు పడిగాపులు కాశారు.. చరణ్ ను చూసి హాయ్ చెపితే చాలు అనుకుంటూ ఆరాటపడ్డారు. ఎయిర్ పోర్ట్ అంతా రామ్ చరణ్ అభిమానులతో కోలాహలంగా మారింది.
చరణ్ రావడంతో ఒక్కసారిగా ఆయన దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు అభిమానులు. ఇక పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ ఇది ముందుగానే గుర్తించి చరణ్ కు వలయంగా ఏర్పడి.. కారువద్దకు తీసుకెళ్లారు. ఫ్యాన్స్ ను నిరుత్సాహపరచకుండా.. రామ్ చరణ్ కారు ఎక్కే ముందు ఫ్యాన్స్ కు అభివాదం చేశారు. ఇక చరణ్ తో పాటు వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో దిగిన స్టార్ డైరెక్టర్ కమ్ స్టార్ యాక్టర్ ఎస్ జే సూర్య.. ఇదంతా చూసి షాక్ అయ్యారు. రామ్ చరణ్ పై అభిమానులకు ఉన్న ప్రేమ, ఆయనకు ఇక్కడ ఉన్న క్రేజ్ చూసి షాక్ అయ్యారు. ఆజనంలో వెనకాలే ఉండిపోయారు.
కొద్ది సేపుచరణ్ అభిమానులు చేసిన హడావిడి చూసిన ఎంజాయ్ చేశారు సూర్య. ఆతరువాత సూర్యను కూడా చూసిన ఫ్యాన్స్.. సెల్ఫీలకోసం ఎగబడ్డారు. జై చరణ్, జై జై చరణ్ అంటూ అభిమానులు చేసిన గోలను ఎంజాయ్ చేశారు సూర్య. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా ఈ షెడ్యూల్ షూటింగ్ మార్చి 19 వరకు జరగనుంది. ఆ తరువాత మార్చి 20న రామ్ చరణ్ హైదరాబాద్ వచ్చి RC16 మూవీని పూజ కార్యక్రమాలతో లాంచ్ చేయబోతున్నారట. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ హైదరాబాద్ లో గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. మే నెల లోపు ఈ మూవీ షూటింగ్ ని పూర్తీ చేసేలా శంకర్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ నెల 27న చరణ్ బర్త్ డే సందర్భంగా గేమ్ ఛేంజర్ నుంచి అప్ డేట్ రాబోతోంది.
