ఇటీవల జారిగిన తెలుగు పరిశ్రమ మా ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా ఓడిపోవడంతో ఆయన మీడియా ముందుకు వచ్చి కంటతడి పెట్టుకున్నారు. తనపై నరేష్ చేసిన వ్యాఖ్యలు నిజం కావని ఆ విషయాల్లో క్లారిటీ ఇవ్వడానికే ఈ విధంగా ప్రెస్ ముందుకు వచ్చినట్లు మాట్లాడారు. 

తన గెలుపు కోసం శ్రీకాంత్ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి చాలా కృషి చేశారని ఇప్పుడు గెలిచిన వారిలో ఏ ఒక్కరు కూడా మా మీటింగ్ లలో పాల్గొనలేదని వారి అటెండెన్స్ 20, 30 శాతం కూడా ఉండదని అన్నారు. నేను శ్రీకాంత్ ఎప్పుడు తప్పు చేయాలదని చెబుతూ తనపై చేసిన కామెంట్స్ నిజం కావని మా అందరి అటెండెన్స్ 90, 80 శాతం ఉంటాయని  కావాలంటే చెక్ చేసుకోండని శివాజీ రాజా మాట్లాడారు. 

ఇక ఈ ఎలక్షన్స్ లో తాను పాల్గొనాలని అనుకోలేదని అరుణాచలం వెళ్లిపోదామనుకున్న సమయంలో అందరూ ఉండమంటే ఎన్నికల్లో ఉన్నట్లు చెప్పారు. అదే విధంగా ఎన్నికల ముందు శ్రీకాంత్ - ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పిన మాటలు ఇప్పుడు కళ్ళ వెంట నీళ్లు తెప్పిస్తున్నాయని తన గెలుపు కోసం వారు చాలా కృషి చేశారని శివాజీ రాజా భావోద్వేగానికి లోనయ్యారు. 

డైరెక్షన్ చేసి లక్కును పరీక్షించుకున్న టాప్ యాక్టర్స్