కాటమరాయుడు చిత్రంలో పవన్ కళ్యాణ్ తమ్ముడిగా నటించిన శివబాలాజీ షూటింగ్ జరిగిన తీరుపై తన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టిన శివబాలాజీ ఓ ఆగంతకుడు నెగటివ్ గా స్పందించటమే కాక దూషించడంతో కోపమొచ్చింది సదరు ఆగంతకునిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన శివబాలాజీ
హీరో శివబాలాజీ ని కించపరుస్తూ వచ్చిన ఓ పోస్ట్ పై తీవ్రంగా ఆగ్రహించిన శివబాలాజీ సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించాడు . తెలుగులో పలు చిత్రాల్లో నటించిన శివబాలాజీ ప్రస్తుతం కాటమ రాయుడు చిత్రంలో పవన్ కళ్యాణ్ తమ్ముడి గా నటిస్తున్నాడు . ఆ సినిమా షూటింగ్ పూర్తికావడంతో మేమంతా కసిగా కాటమ రాయుడు చిత్రాన్ని కంప్లీట్ చేశామని చెబుతూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు అయితే దానికి కొంతమంది యాంటీ గా కామెంట్లు పెట్టడంతో ఆగ్రహించిన శివబాలాజీ గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించాడు.
శివబాలాజీ ఇచ్చిన ఫిర్యాదు ని స్వీకరించిన పోలీసులు సైబర్ క్రైమ్ లో కేసు నమోదు చేసారు . ప్రస్తుతం పోలీసులు నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు . కాటమ రాయుడు చిత్రం రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కింది . కాగా ఈ చిత్రం ఈనెల 24న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు పొలిటికల్ గా కూడా చక్రం తిప్పుతుండటంతో... గిట్టనివారు నెగెటివ్ గా స్పందిస్తున్నారు.
