తమ గారాల పట్టి సితారకు సర్ ప్రైజ్ ఇచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. బర్త్ డే సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా తెలిపారు.
సూపర్ స్టార్ మహేష్ బాబుకు తన కూతురు సితార అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొడుకు గౌతమ్ కంటే సితారతోనే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తుంటాడు మహేష్ బాబు. సోషల్ మీడియాలో కూడా కూతురితో ఉన్న ఫోటోలు, వీడియోలే ఎక్కువగా శేర్ చేస్తుంటాడు. ఎప్పటికప్పుడు ఆమెకు సర్ ప్రైజ్ లు..అడిగినవన్నీ కాదనకుండా ఇచ్చే మహేష్.. సితారను చాలా స్ట్రాంగ్ గా తయారు చేస్తున్నాడు.
All So Read: ప్రభాస్ మూవీ నుంచి తీసేశారు..? స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం, ఎవరు ఆ బ్యూటీ..?
తన లైఫ్ ను తాను చాలా స్వతంత్రంగా లీడ్ చేసేలా తయారు చేస్తున్నాడు. ఇక సితారకు డాన్స్, మర్షలాట్స్ లాంటి వాటిలో కూడా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే సితార.. సెలబ్రిటీ స్టేటస్ ను ఇప్పుడే సాధించేసింది. స్టార్ హీరోయిన్లను కూడా మించి ఫాలోవర్స్ ను కలిగి ఉంది సితార. ఇక ఆమె పెట్టే వీడియోస్, ఫోటోస్ కు లక్షల్లో వ్యూస్ తో పాటు.. కామెంట్లు కూడా రావడం చూస్తూనే ఉంటా.
సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతలు తాజాగా తమ గారాలపట్టి సితారకు ఓ సర్ ప్రైజ్ ఇచ్చారంట. యాక్టింగ్, సింగింగ్, పెయింటింగ్, డ్యాన్సింగ్‌లో తన టాలెంట్ ఏంటో ఇప్పటికే నిరూపించిన ఈమెకు వీటన్నిటికి సంబంధించిన ఓ సర్ ప్రైజ్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోందతి. అయితే ఈ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడానికి కారణం కూడా ఉంది. ఈరోజు (జులై 20)సితార పుట్టినరోజు . ఈ సందర్భంగా మహేశ్ బాబు తన కూతురికి సోసల్ మీడియా వేదికగా బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.
All So Read: రామ్ చరణ్ ను కాదని అల్లు అర్జున్ కు హిట్ సినిమా కథను ఇచ్చిన చిరంజీవి.. కారణం ఇదే..?
నా జీవితంలోని వెలుగుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ మహేశ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. సూర్యుడి వెలుగు సితార ముఖం పై పడే ఫోటోను పోస్ట్ చేశాడు. కాగా.. ప్రస్తుతం మహేశ్ ట్వీట్ వైరల్ అవుతుండగా సెలబ్రిటీల దగ్గర నుంచి సితార, మహేష్ ఫ్యాన్స్ వరకూ. .అందరూ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సంరద్భంగానే మహేష్ నమ్రతగా కలిసి సితారకు కాస్ట్లీ గిఫ్ట్ కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
ఇక మహేష్ తో పాటు సితార తల్లి నమ్రతా శిరోద్కర్ కూడా తన గారాల పట్టికి బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో సితార చిన్నప్పటి నుంచి పిక్స్ తో పాటు కొన్ని క్యూట్ మూమెంట్స్ ను కలిపి నెట్టింట పంచుకున్న నమ్రత.. సితారకు బర్త్ డే విష్ చేశారు.
భార్యను వదిలేద్దామనుకున్నా పూరీ జగన్నాథ్.. లావణ్య గురించి ఆ నిజం తెలియడంతో షాక్ అయ్యాడట.
