Asianet News TeluguAsianet News Telugu

sirivennela sitarama sastry: సిరివెన్నెల ఆరోగ్యం విషమం.. ఫ్యామిలీకి వైద్యుల కబురు

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ గీత  రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (sirivennela sitarama sastry) ఆరోగ్య పరిస్ధితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. న్యూమోనియాతో (pneumonia) బాధపడుతూ కిమ్స్‌లో (kims hospital) చేరారు సిరివెన్నెల. 

sirivennela sitarama sastry health condition is critical
Author
Hyderabad, First Published Nov 30, 2021, 3:36 PM IST

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ గీత  రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (sirivennela sitarama sastry) ఆరోగ్య పరిస్ధితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. న్యూమోనియాతో (pneumonia) బాధపడుతూ కిమ్స్‌లో (kims hospital) చేరారు సిరివెన్నెల. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్ధితి విషమించడంతో కుటుంబసభ్యులను పిలిపించి వారికి వివరాలు చెబుతున్నారు వైద్యులు. 

ఇక  తన సాహిత్యంతో పాటకు ప్రాణం పోస్తారు సిరివెన్నెల.. “విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం” అంటూ మొదలన ఆయన పాటల ప్రయాణం నిర్విరామంగా కొనసాగుతోంది. మొదటి సినిమాతోనే తనలోని సరస్వతిని దర్శక దిగ్గజం కళాతపస్వి కె విశ్వనాథ్ కు పరిచయం చేసారు సిరివెన్నెల. ఆ సినిమాలో ఆయన రాసిన పాటలన్నీ ఆణిముత్యాలే.. అలాగే రుద్రవీణ సినిమాలో నమ్మకు నమ్మకు ఈ రేయినీ అనే పాట  .. లలిత ప్రియ కమలం విరిసినదీ అనే పాటలను అద్భుతంగా రాసారు సిరివెన్నెల.  లలిత ప్రియా కమలం పాటకు గాను జాతీయ అవార్డును కూడా అందుకున్నారు.

ALso Read:Sirivennela : తీవ్ర అస్వస్థతతో కిమ్స్ లో చేరిన సిరివెన్నెల సీతారామశాస్త్రి

సిరివెన్నెల బలమైన పదజాలం ఉపయోగిస్తూ తన పాటల్లో ప్రత్యేకత చాటుకుంటారు. త్రివిక్రమ్ చెప్పినట్లు సిరివెన్నెల ఉపయోగించే పదాలని డిక్షనరీలో వెతుక్కోవాల్సిందే. అంత లోతుగా ఆయన పాటల్లో భావాలు ఉంటాయి. ఇటీవల సిరివెన్నెల రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను 'దోస్తీ' అనే పాటకు లిరిక్స్ అందించారు. ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం అంటూ సిరివెన్నెల అందించిన లిరిక్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఆయన 1986లో సిరివెన్నెల చిత్రంతో గేయ రచయితగా పరిచయమయ్యారు. అలా సిరివెన్నెల ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. సిరివెన్నెల చిత్రానికి గాను ఆయన ఉత్తమ లిరిసిస్ట్ గా నంది అవార్డు అందుకున్నారు. 

శ్రుతిలయలు, స్వర్ణ కమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి ఎన్నో చిత్రాలకు సిరివెన్నెల నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. తన లిరిక్స్ తో అలరిస్తూ వచ్చిన సిరివెన్నెల త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios