Asianet News TeluguAsianet News Telugu

Sirivennela : తీవ్ర అస్వస్థతతో కిమ్స్ లో చేరిన సిరివెన్నెల సీతారామశాస్త్రి

లెజెండ్రీ లిరిసిస్ట్ Sirivennela Seetharama Sastry దశాబ్దాలుగా తెలుగు సినిమాకు సేవలందిస్తున్నారు. సిరివెన్నెల కలం నుంచి ఎన్నో అద్భుతమైన పాటలు జాలువారాయి.

Sirivennela Seetharama Sastry hospitalized
Author
Hyderabad, First Published Nov 27, 2021, 8:39 PM IST

లెజెండ్రీ లిరిసిస్ట్ Sirivennela Seetharama Sastry దశాబ్దాలుగా తెలుగు సినిమాకు సేవలందిస్తున్నారు. సిరివెన్నెల కలం నుంచి ఎన్నో అద్భుతమైన పాటలు జాలువారాయి. ఆయన ఆరోగ్యం గురించి ఊహించని వార్త తాజాగా బయటకు వచ్చింది. సిరివెన్నెల తీవ్ర అస్వస్థతతో కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. 

దీనితో తెలుగు సినీ ప్రముఖుల్లో, అభిమానులు సిరివెన్నెల గురించి ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితమే సిరివెన్నెల అనారోగ్యంతో కిమ్స్ లో చేరారట. కిమ్స్ వైద్యులు సిరి వెన్నెలకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం సిరివెన్నెల కండిషన్ ఏంటనేది పూర్తిగా తెలియరాలేదు. 

సిరివెన్నెల బలమైన పదజాలం ఉపయోగిస్తూ తన పాటల్లో ప్రత్యేకత చాటుకుంటారు. త్రివిక్రమ్ చెప్పినట్లు సిరివెన్నెల ఉపయోగించే పదాలని డిక్షనరీలో వెతుక్కోవాల్సిందే. అంత లోతుగా ఆయన పాటల్లో భావాలు ఉంటాయి. ఇటీవల సిరివెన్నెల రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను 'దోస్తీ' అనే పాటకు లిరిక్స్ అందించారు. 

ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం అంటూ సిరివెన్నెల అందించిన లిరిక్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఆయన 1986లో సిరివెన్నెల చిత్రంతో గేయ రచయితగా పరిచయమయ్యారు. అలా సిరివెన్నెల ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. సిరివెన్నెల చిత్రానికి గాను ఆయన ఉత్తమ లిరిసిస్ట్ గా నంది అవార్డు అందుకున్నారు. 

శ్రుతిలయలు, స్వర్ణ కమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి ఎన్నో చిత్రాలకు సిరివెన్నెల నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. తన లిరిక్స్ తో అలరిస్తూ వచ్చిన సిరివెన్నెల త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

Also Read: ఏపీ టిక్కెట్ రేట్ల విధానంపై సురేష్ బాబు షాకింగ్ కామెంట్

Follow Us:
Download App:
  • android
  • ios