సింగర్ సునీత తన భర్త నుండి విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే రెండు రోజులుగా ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వినిపించాయి. ఈ విషయంపై స్పందించిన ఆమె తనకు ఇప్పట్లో అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది. తనపై సోషల్ మీడియాలో జరుగుతోన్న ఈ ప్రచారం పట్ల ఆమె నవ్వుకుంది. అయితే తనకు అందరూ ఫోన్లు చేసి కంగ్రాట్స్ చెబుతుంటే మొదట విషయం అర్ధం కాలేదని, వాళ్లనే తిరిగి అడిగితే మీ పెళ్లంట కదా అని చెప్పగా షాక్ అయినట్లు చెప్పుకొచ్చారు.

అయితే తను మళ్లీ పెళ్లి చేసుకొని సంతోషంగా జీవించాలని అందరూ కోరుకోవడం తనకు ఆనందాన్నిస్తుందని సునీత అన్నారు. తన కుటుంబ సభ్యులు కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం ఆమెకు నచ్చిందని తెలిపారు. మరిన్ని విషయాలు చెబుతూ.. 'మా అమ్మ, నాన్న.. ప్రపంచం మొత్తం నీ గురించి ఇంతగా ఆలోచిస్తూ నీ మంచి కోరుతున్నారు. నిజంగా మళ్లీ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండొచ్చు కదా..' అని అన్నారు.

ఇక నా కొడుకు ఆకాష్ ఢిల్లీలో బీటెక్ చదువుతున్నాడు. వాడు నిన్న నాకు ఫోన్ చేసి 'అమ్మా పెళ్లి డేట్ ఎప్పుడు..? నిజంగానే చేసుకో మమ్మీ అంటూ వాడు చెప్పడంతో వారు నా సంతోషాన్ని ఇంతగా కోరుకుంటున్నారు ఇంకేం కావాలి జీవితానికి అనిపిస్తుంది' అంటూ వెల్లడించింది.