సింగర్ సునీత (Singer Sunitha) రైతుగా మారారు. ఆమె వ్యవసాయం చేస్తున్న వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ఆ వీడియో చూసిన ఫ్యాన్స్ లైక్స్, కామెంట్స్ తో అభిమానం చాటుకుంటున్నారు.
సెలెబ్రెటీలకు వ్యవసాయం అంటే సరదా. పరిశ్రమలో ప్రతి స్టార్ హీరో ఓ ఫార్మ్ ల్యాండ్ కలిగి ఉన్నారు. ఖాళీ సమయాల్లో సదరు ఫార్మ్ హౌస్ లో గడపడం వారికి ఆహ్లాదం పంచే విషయం. అలాగే అక్కడ ఆవులు, గేదెల పెంపకం, పళ్ళు, కూరగాయలు పండించడం చేస్తుంటారు. ఆహారంలో పెస్టిసైడ్స్ వాడకం పెరిగిపోయాక.. ధనవంతులు సొంతంగా ఆర్గానిక్ వ్యవసాయం చేసుకుంటున్నారు. తమ ఫార్మ్ హౌస్ ల్యాండ్స్ లో పళ్ళు, కూరగాయలు క్రిమిసంహారక మందులు వాడకుండా పండించి తింటున్నారు. ఓ దశాబ్దకాలంగా ఈ ట్రెండ్ ఎక్కువైంది.
నగర శివారులో వ్యవసాయ భూమి కలిగి ఉండటం ఒక స్టేటస్ గా సెలెబ్రిటీలు బావిస్తున్నారు. సింగర్ సునీత కూడా తమ ఫార్మ్ హౌస్ లో వ్యవసాయం చేస్తున్నారు. ఆమె తమ పొలంలో పండిన అరటి పండ్లను స్వయంగా చెట్టునుండి కోశారు. సదరు వీడియో ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా.. లక్షల్లో వీక్షించారు. ఇక 23 వేలకు పైగా నెటిజెన్స్ ఆ వీడియోను లైక్ చేశారు. పలువురు కామెంట్స్ చేయడం జరిగింది. సునీత వ్యవసాయం చేస్తున్న వీడియో వైరల్ గా మారింది.
కాగా సునీత రెండవ వివాహం తర్వాత మరింత హ్యాపీ లైఫ్ అనుభవిస్తున్నారు. 2021 జనవరి 9న సునీత మ్యాంగో మీడియా అధినేత రామ్ ని వివాహం చేసుకున్నారు. 42 ఏళ్ల సునీత రెండవ వివాహం చేసుకోవడంపై విమర్శలు తలెత్తాయి. పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉండగా వివాహం అవసరమా అంటూ సోషల్ మీడియాలో కొందరు విమర్శలు దాడికి దిగారు. తన పిల్లల భవిష్యత్ కోసమే రెండో పెళ్లి నిర్ణయమని సునీత వివరణ ఇచ్చారు.
Also read Deepthi Sunaina: షణ్ముఖ్ తో బ్రేకప్ లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న దీప్తి... ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
రామ్ తో సునీత దాంపత్య జీవితం ఆనందంగా ఉంది. ఆమె కెరీర్ లో మరలా బిజీ అయ్యారు. టెలివిజన్ షోలకు జడ్జిగా, సింగర్ గా కొనసాగుతున్నారు. ఒక దశలో సునీత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెకు అలాంటి సమస్యలు లేవు. హ్యాపీగా కెరీర్ చూసుకుంటూనే.. విరామం దొరికినప్పుడల్లా ఇష్టమైన ప్రదేశాలకు మిత్రులతో విహారానికి వెళుతున్నారు. సింగర్ సునీత తన కుమారుడు ఆకాష్ ని హీరోని చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారట, ఇక కూతురు శ్రేయా ఇప్పటికే సింగర్ గా ఎంట్రీ ఇచ్చారు. సునీతతో పాటు భర్త రామ్ కి పరిశ్రమలో మంచి పరిచయాలున్న నేపథ్యంలో ఇండస్ట్రీలోనే పిల్లల్ని సెటిల్ చేయాలని చూస్తున్నారు.
