టాలీవుడ్ లో కొన్ని వందల పాటలు పాడిన సింగర్ సునీత కొన్నాళ్ల క్రితం తన భర్త నుండి విడిపోయింది. 40 ఏళ్ల  వయసు గల సునీతకు ఇరవై ఏళ్ల కుమారుడు ఆకాష్, 17 ఏళ్ల కుమార్తె శ్రేయ ఉన్నారు. 19 ఏళ్ల  వయసులోనే పెళ్లి చేసుకున్న సునీత కొన్ని వ్యక్తిగత కారణాలతో చాలా ఏళ్లుగా తన భర్తకు దూరంగా ఉంటుంది.

గతంలో ఓ ఇంటర్వ్యూలో తనకు రెండో పెళ్లి ఆలోచన లేదని చెప్పిన సునీత ఇప్పుడు పెళ్ళికి సిద్ధమైందంటూ వార్తలు ఊపందుకున్నాయి. ఈ విషయంపై సునీతకు స్పందించక తప్పలేదు. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ వార్తలను ఉద్దేశిస్తూ..

''ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి ఎప్పుడూ ఎందుకంత ఆసక్తి కనబరుస్తారు..?'' అంటూ ఘాటుగా స్పందించింది. ఈ విషయంలో ఆమెకు సపోర్ట్ గా పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా మీరు కెరీర్ లో మరింత ముందుకు వెళ్లాలంటూ ఆమెను ప్రోత్సహిస్తున్నారు. వ్యక్తిగతంగా కూడా ఇప్పట్లో ఆమెకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని సన్నిహితవర్గాల ద్వారా తెలుస్తోంది.