Asianet News TeluguAsianet News Telugu

సుచీలీక్స్ సుచిత్ర కిడ్నాప్ కలకలం

  • సంచలనం సృష్టిస్తున్న సింగర్ సుచిత్ర కిడ్నాప్ వ్యవహారం
  • పలువురు సుచీలీక్స్ బాధితులే ఈ కిడ్నాప్ వెనుకున్నారని అనుమానం
  • సుచిత్ర విదేశాలకు వెళ్లిందని తెరపైకి వస్తున్న మరో వాదన
singer suchitra kidnap news creates sensation

దక్షిణాది సినీ పరిశ్రమలకు చెందిన పలువురు బడా హీరో హీరోయిన్ల చీకటి జీవితాలను సోషల్ మీడియాలో పెట్టి సంచలనం సృష్టించిన సింగర్ సుచిత్ర కిడ్నాప్ కు గురైందా.. అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. గత కొద్ది రోజులుగా సుచీ లీక్స్ వ్యవహారం సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు తాజాగా సింగర్ సుచిత్ర కిడ్నాప్ వార్త కలకలం రేపుతోంది. 

 

స్టార్ హీరోలు, హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్ పర్సనల్ ఫొటోలు, వీడియోలను లీక్ చేసి సంచలనం సృష్టించిన సింగర్ సుచిత్ర సుచీలీక్స్ పేరిట సోషల్ మీడియాలో పెట్డిన వీడియోలు, ఫొటోలు కోలీవుడ్‌లో ఎన్ని ప్రకంపనలు సృష్టించాయో తెలిసిందే. అయితే సుచిత్ర మానసిక పరిస్థితి బాగాలేదని ఆమె భర్త కార్తీక్ ప్రకటించాడు. సుచీలీక్స్ వ్యవహారంతో ఆమె వైవాహిక బంధమూ దెబ్బతింది.

 

మరో వైపు ఆ వీడియో..ఈ వీడియో..సంచలనం సృష్టిస్తానంటూ సుచీలీక్స్‌లో ప్రకటించినా.. అలాంటివేమీ రాకపోవడంతో వ్యవహారం సద్దుమణిగింది. దీంతో అక్కడికి ఈ వివాదం ముగిసినట్టేనని అనుకుంటున్న టైమ్ లో తాజాగా మళ్లీ వివాదా రేగుతోంది.

 

సింగర్ సుచిత్ర విదేశాలకు వెళ్లిందని ప్రచారం జరుగుతున్నా... అసలు జరిగింది వేరని... సుచిత్రను కిడ్నాప్ చేశారన్న వార్తలు కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. కోలీవుడ్‌లోని కొందరు పెద్దలే ఆమెను కిడ్నాప్ చేశారన్న ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంలో ధనుష్, అనిరుధ్, ఆండ్రియా, చిన్మయి, హన్సిక, త్రిష వంటి అగ్ర నటీనటుల ప్రైవేటు ఫొటోలను పెట్టి వారిని సుచిత్ర బజారుకీడ్చింది.

 

దీంతో సుచిత్రను కిడ్నాప్ చేయించారని జోరుగా ప్రజారం సాగుతోంది. ఈ వ్యవహారంతో సుచీలీక్స్ మరో ప్రకంపనాన్ని సృష్టించిందన్న వార్తలు వస్తున్నాయి. తాజాగా బాత్రూమ్‌లో స్నానం చేస్తున్న ఓ నటి ఫొటోలను సుచీలీక్స్‌లో పెట్టారు. మరి రాను రాను ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios