దేవిశ్రీప్రసాద్ నన్ను నమ్మించి మోసం చేశారు : సింగర్ గంటా వెంకట లక్ష్మి

First Published 19, Jul 2018, 12:23 PM IST
Singer ganta venkata lakshmi says devisri prasad didnt give my remuneration
Highlights

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా అందాల భామ సమంతా హీరోయిన్ గా, ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిన చిత్రం రంగస్థలం.ఈ మూవీలో పూజా హెగ్డే ఐటెం సాంగ్ లో నటించగా జిగేల్ రాణి రాణి అనే సాంగ్ ను పాడారు గంటా వెంకట లక్ష్మీ. 

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా అందాల భామ సమంతా హీరోయిన్ గా, ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిన చిత్రం రంగస్థలం.ఈ మూవీలో పూజా హెగ్డే ఐటెం సాంగ్ లో నటించగా జిగేల్ రాణి రాణి అనే సాంగ్ ను పాడారు గంటా వెంకట లక్ష్మీ. అయితే ఈ మూవీలో పాట పాడితే కొంత మొత్తాన్ని ఇస్తామని ముందు ఒప్పందం జరిగింది.

తీరా పాట పాడాక అది బయటకు వచ్చిన తర్వాత బంపర్ హిట్ అయ్యింది. అయితే ముందుగా అనుకున్న పారితోషకం తనకు ఇవ్వలేదు. నిర్మాతలను అడిగిన లాభం లేదు.మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ను అడిగిన లాభం లేదు. నన్ను నమ్మించి మోసం చేశారు అని ఆమె వాపోయారు..

loader