ఎయిర్ లైన్ సిబ్బంధితో సింగర్ ఆదిత్య నారాయణ్ దురుసు ప్రవర్తన

singer aditya narayan misbehaves with indigo airline staff
Highlights

  • ఎయిర్ లైన్ సిబ్బందితో ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఆదిత్య నారాయణ ఘర్షణ
  • రాయ్ పూర్ ఎయిర్ పోర్టులో అదనపు లగేజీ చార్జీలు కట్టమనటంతో వివాదం
  • ఎక్స్ ట్రా లగేజీకి 13 వేలకు కేవలం 10వేలు మాత్రమే కడతానన్న ఆదిత్య

ప్రముఖ బాలీవుడ్ సింగర్, టీవీ యాంకర్ ఆదిత్య నారాయణ్ రాయ్ పూర్ ఎయిర్ పోర్టులో ఇండిగో విమాన సంస్థ ఉద్యోగులను బెదిరిస్తూ కెమెరాలకు చిక్కాడు. ప్రముఖ టెలివిజన్ న్యూస్ ఛానెల్ రిపబ్లిక్ టీవీ కథనం ప్రకారం.. ఎయిర్ పోర్టు ఉద్యోగిని బెదిరిస్తూ రెడ్ హాండెడ్ గా పట్టుబడ్డాడు.

అందులో... అక్కడంతా వున్నారు. ఇది వ్యక్తిగత వ్యవహారంగా మారుస్తున్నావు. నేనేమనకున్నా నువ్వు నన్ను దూషిందొద్దు అని అన్నాకే.. దూషించటం మొదలు పెట్టానని చుట్టు వున్న పది మంది చూసారు. నేనేం అనాలనుకున్నానో అంటాను. అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతునే వున్నాడు.

 

దీనిపై స్పందించిన ఇండిగో ఎయిర్ లైన్స్.. సింగర్ ఆదిత్య నారాయణ్ ఐదుగురితో కలిసి ట్రావెల్ చేస్తున్నారని, అతను అధిక బరువుతో కూడిన లగేజీ తీసుకెళ్తున్నాడని.. దానికి 14వేల రూపాయలు కట్టాల్సిందిగా సిబ్బంది కోరగా... 10వేలకన్నా ఎక్కువ ఇవ్వనని... వాదులాటకు దిగారని పేర్కొంది. అంతేకాక మహిళా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారని తెలిపింది.

అయితే ఆదిత్య ప్రవర్తన పట్ల, ఇండిగో సంస్థ వైఖరి పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

loader