Asianet News TeluguAsianet News Telugu

బయ్యర్లను ఆందోళన పరుస్తున్న సింగం3 కలెక్షన్లు

  • నిరాశపరుస్తున్న సింగం3 కలెక్షన్లతో బయ్యర్లలో ఆందోళన
  • తొలి రెండు సింగం సిరీస్ సినిమాలు హిట్
  • సింగం 3 కలెక్షన్లతో కనిపించని జోష్

 

singam three tension to buyers

సింగం సిరీస్ లో వచ్చిన తొలి రెండు చిత్రాలు కూడా సూపర్ హిట్ కావడంతో సింగం సీక్వెల్ యముడు 3 రిలీజ్ చేసారు.అయితే ఫిబ్రవరి 9 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన సింగం 3 కి మిశ్రమ స్పందన వస్తోంది. తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సూర్య కు తమిళనాట పరిస్థితి ఏం బాగోలేదు. మూడు రోజుల్లో కేవలం 7 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఒక్క రోజులో రావాల్సిన షేర్ మూడు రోజుల్లో వచ్చిందంటే ఎంత ఘోరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు .

 

సింగం3(యముడు)తెలుగులో 5 కోట్ల షేర్ ని రాబట్టింది. గతంలో సూర్య నటించిన 24 చిత్రం కూడా తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ వసూళ్ల ని రాబట్టింది. ఇక ఇప్పుడేమో సింగం 3 తమిళంతో సమానంగా వసూళ్లు సాధిస్తోంది . అయితే ఈ వసూళ్లు అంత గొప్పగా లేకపోవడం సూర్యని నిరాశ పరుస్తోంది. ఇటు సూర్యనే కాక బయ్యర్లను కూడా ఆందోళన పరుస్తోంది. సూర్య ఇమేజ్ కి తగ్గ వసూళ్లు రాాకపోవడంతో బయ్యర్లు నష్టపోవడం ఖాయమని తెలుస్తోంది. నామమాత్రపు వసూళ్ల తో సూర్య సింగం 3 నిరాశపరుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios