నటుడు శింబు చుట్టూ కుట్ర జరుగుతోందని ఆయన తండ్రి నటుడు, దర్శకనిర్మాత టి.రాజేందర్ అన్నారు. సినిమాలతో పాటు రాజకీయాలపరంగా కూడా రాజేందర్ తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఆదివారం సేలంకి వెళ్లిన ఆయన మీడియాతో ముచ్చటించారు.

తనకు రాజకీయ వనవాసం ముగిసిందని అన్నారు. ఇప్పుడు తనకు విముక్తి కలిగిందని చెబుతూ.. కొత్తగా పుట్టుకొస్తున్న రాజకీయ పార్టీల గురించి ప్రస్తావిస్తూ వెటకారంగా మాట్లాడారు. 'రాజకీయ పార్టీని మొదలుపెట్టడానికి చాలా సహనం ఉండాలి. పోరాటం తరువాతే కరుణానిధి డీఎంకే అధ్యక్షుడు అయ్యారు. ఆయన ఉండగా ఎన్నికలను ఎదుర్కోవడం వేరు. ఆయన ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది'' అంటూ వెల్లడించారు.

అలానే నటుడు శింబుకి కోర్టు హెచ్చరికలు జారీ చేసిన విషయంపై ప్రస్తావించారు. ఓ సినిమాలో నటిస్తానని నిర్మాతల వద్ద యాభై లక్షలు తీసుకున్న సినిమాలో శింబు ఆ సినిమాలో నటించకుండా.. అడ్వాన్స్ ఎగ్గొట్టాడు. ఈ విషయంపై నిర్మాతలు కోర్టుని సంప్రదించగా.. వారు రూ.85 లక్షలు శింబు నిర్మాతలకు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై రాజేందర్ మాట్లాడుతూ.. శింబు చుట్టూ కుట్ర జరుగుతోందని.. సంచలన వ్యాఖ్యలు చేశారు.  

ఇది కూడా చదవండి.. 

తమిళ నటుడు శింబుపై హైకోర్టు సీరియస్!