తమిళ నటుడు శింబుపై హైకోర్టు సీరియస్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 1, Sep 2018, 4:27 PM IST
provide security for 85 lakhs or face action high court tells simbu
Highlights

తమిళంలో టాప్ హీరోగా కొనసాగుతోన్న నటుడు శింబుపై మద్రాసు హైకోర్టు ఫైర్ అయింది. నిర్మాత నుండి తీసుకున్న అడ్వాన్స్ ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

తమిళంలో టాప్ హీరోగా కొనసాగుతోన్న నటుడు శింబుపై మద్రాసు హైకోర్టు ఫైర్ అయింది. నిర్మాత నుండి తీసుకున్న అడ్వాన్స్ ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. డబ్బు చెల్లించకపోతే ఆస్తులను జప్తు చేయాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది.

'అరాసన్' అనే సినిమాలో హీరోగా నటించడానికి ఫ్యాషన్ మూవీ మేకర్స్ దగ్గర 2013లో జూన్ 17న రూ. 50 లక్షలను అడ్వాన్స్ గా తీసుకున్నాడు శింబు. కానీ కమిట్మెంట్ ప్రకారం ఆ సినిమాలో నటించకపోవడంతో నిర్మాతలు కోర్టుని ఆశ్రయించారు.

దీంతో వడ్డీతో కలిపి రూ.85 లక్షలు ఫ్యాషన్ మూవీ మేకర్స్ కి చెల్లించాల్సిందిగా కోర్టు శింబుని ఆదేశించింది. మరి శింబు దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం శింబు 'చెక్క చైవంత వానమ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. మణిశర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా తెలుగులో 'నవాబ్' పేరుతో విడుదల కానుంది.  

loader