SIIMA Awards 2025: దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ 2025లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. `కల్కి 2898 AD` ఉత్తమ చిత్రం, `పుష్ప 2` అత్యధిక అవార్డులు గెలుచుకుంది. అల్లు అర్జున్, రష్మిక ఉత్తమ నటుడు, నటిగా, సుకుమార్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు.

SIIMA Awards 2025: దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరుగుతున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA 2025) వేడుక అంగరంగ వైభవంగా సాగుతోంది. శుక్రవారం జరిగిన తొలి రోజు వేడుకలో తెలుగు, కన్నడ విభాగాలకు చెందిన నటీనటులు, టెక్నీషియన్లు అవార్డులు అందుకున్నారు.సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2025 వేడుకలో తెలుగు సినీనటులు మరోసారి సత్తాచాటారు.

సైమా వేడుకలో వేడుక‌ల్లో పుష్ప‌2, కల్కి 2898 AD’సినిమాలు సత్తా చాటాయి. ఈ సినిమాలు ఎక్కువ అవార్డులు గెలుచుకుని హవా చూపించాయి. సైన్స్ ఫిక్షన్ జానర్‌లో ప్రేక్షకులని మరో లోకంలోకి తీసుకెళ్లిన ‘కల్కి 2898 ఏడీ’ ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. . క్టర్ అవార్డును దక్కించుకున్నారు. అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కించుకున్నారు. 

అలాగే.. ఉత్తమ నటిగా రష్మిక మందన్నా( పుష్ప 2), పుష్ప 2: ది రూల్ సినిమాకు దర్శకత్వం వహించిన సుకుమార్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు. ‘హనుమాన్’ సినిమాతో ప్రశాంత్ వర్మ క్రిటిక్స్ ఛాయిస్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు, అదే చిత్రంలోని హీరో తేజ సజ్జా క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నారు.

SIIMA Awards 2025 అవార్డుల పూర్తి జాబితా:

ఉత్తమ చిత్రం – కల్కి 2898 AD (వైజయంతి మూవీస్)

ఉత్తమ దర్శకుడు – సుకుమార్ (పుష్ప 2: ది రూల్)

ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) – ప్రశాంత్ వర్మ (హనుమాన్)

ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – తేజ సజ్జా (హనుమాన్)

ఉత్తమ నటి – రష్మిక మందన్నా (పుష్ప 2: ది రూల్)

ఉత్తమ నటి (క్రిటిక్స్) – మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)

ఉత్తమ సహాయ నటుడు – అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 AD)

ఉత్తమ సహాయ నటి – అన్నా బెన్ (కల్కి 2898 AD)

ఉత్తమ సంగీత దర్శకుడు – దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప 2: ది రూల్)

ఉత్తమ గీత రచయిత – రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లే – దేవర)

ఉత్తమ పురుష ప్లేబ్యాక్ సింగర్ – శంకర్ బాబు కందుకూరి (పీలింగ్స్ – పుష్ప 2: ది రూల్)

ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్ – శిల్పా రావు (చుట్టమల్లే – దేవర)

ఉత్తమ విలన్ – కమల్ హాసన్ (కల్కి 2898 AD)

ఉత్తమ తొలి నటి – పంఖురి భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్ బచ్చన్)

ఉత్తమ తొలి నటుడు – సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోలు)

ఉత్తమ తొలి దర్శకుడు – నందకిశోర్ యేమని (35 ఒక చిన్న కథ)

ఉత్తమ తొలి నిర్మాత – నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోలు)

ఉత్తమ ఛాయాగ్రాహకుడు – రత్నవేలు (దేవర)

ఉత్తమ హాస్యనటుడు – సత్య (మాతు వదలరా 2)