సిద్ధార్థ్ మాయలో మరో భామ!

siddharth to romance divyansha koushik
Highlights

ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను వినియోగించే వారికి  ప్రముఖ మోడల్ 

ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను వినియోగించే వారికి  ప్రముఖ మోడల్ దివ్యాన్ష కౌశిక్ పరిచయస్తురాలే. తన గ్లామర్ తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీని కోలివుడ్, బాలీవుడ్ కు సంబంధించిన దర్శకనిర్మాతలు హీరోయిన్ గా పరిచయం చేయడానికి చాలానే ప్రయత్నాలు చేశారు. కానీ ఈ భామ మాత్రం నటుడు సిద్ధార్థ్ తో కలిసి నటించడానికి అంగీకరించడం విశేషం.

సిద్ధార్థ్ హీరోగా దర్శకుడు కార్తిక్ 'సైతాన్ కా బచ్చా' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. త్వరలోనే సినిమా విడుదల కానుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా మొదలుకానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా దివ్యాన్షను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆమెతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. ఈ సినిమాలో మోడర్న్ అమ్మాయిగా కనిపించనున్నట్లు వెల్లడించింది ఈభామ. మరి సిద్ధార్థ్ సినిమాతో కోలివుడ్ కు పరిచయం కానున్న దివ్యాన్షకు నటిగా ఎలాంటి గుర్తింపు లభిస్తుందో చూడాలి!

loader