శ్రుతిహాస‌న్ పై కోట్లు ఖ‌ర్చుస్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుంటున్న హాట్ బ్యూటీసంఘ‌మిత్ర సినిమా కోసం ఫీట్లు

 శ్రుతిహాసన్ ఇప్పుడు ఈ తరహా కథలవైపు చూస్తుంది. అందులో భాగంగానే ఓ భారీ ప్రాజెక్ట్ లో నటించేందుకు సిద్ధం అవుతోంది. ప్రముఖ దర్శకుడు సుందర్.సి దర్శకత్వంలో రూపొందుతు వస్తున్న భారీ బడ్జెట్ చిత్రంలో శ్రుతిహాసన్ ముఖ్య పాత్ర చేస్తుంది.

ఈ మూవీ బడ్జెట్ దాదాపు 200 కోట్ల రూపాయలు. ‘సంఘమిత్ర’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ మూవీలో శ్రుతిహాసన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనుంది. శృతి చేయబోయే పాత్ర ఇప్పటి వరకూ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఏ హీరోయిన్ కూడ చేయలేదని అంటున్నారు. ప్రమోషన్ ని సైతం ఈ విధంగానే చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే సినిమా మొత్తం చారిత్రక నైపథ్యంలో ఉంటుంది కాబట్టి ఇందులో యుద్ధ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయట. దీంతో యుద్ద సన్నివేశాల కోసం శృతి హాసన్ ప్రొఫెషనల్ ట్రైనర్ వద్ద ప్రాక్టీస్ మొదలు పెట్టింది.

కత్తి యుద్దాలు వంటివి ఈ బ్యూటీ నేర్చుకుంటుంది. అన్ని విధాలైన ఫైట్స్ కోసం శ్రుతిహాసన్ రోజుకి ఓ గంట సమయాన్ని కేటాయిస్తుంది. ఇలా రోజుకి గంట చొప్పున...నెల రోజులు పాటు తీసుకునే ఈ ట్రైనింగ్ కి అక్షరాల కోటి రూపాయల ఖర్చు అవుతుందట. శ్రుతిహాసన్ పై కీలక సీన్స ఉండటంతో తనకి ఈ మాత్రం ట్రైనింగ్ అవసరం ఉంటుందని డైరెక్టర్ అంటున్నారు. నిర్మాతలు సైతం శ్రుతిహాసన్ పై ట్రైనింగ్ కోసం కోటి రూపాయలు ఖర్చు చేయటానికి ఏ మాత్రం వెనకాడటం లేదు.