రాత్రి నిద్రపోయేముందు అన్నీ చెక్ చేసుకుంటా

రాత్రి నిద్రపోయేముందు అన్నీ చెక్ చేసుకుంటా

లోకనాయుడు కమలహాసన్ ప్రస్తుతం రాజకీయల్లో బిజీగా ఉన్నారు. శృతిహాసన్ ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు తప్పిలతే చేతిలో ఏమీ లేవు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు అంతా ఉరుకుల పరుగుల జీవితం. బిజీ షెడ్యూల్. రాత్రయ్యేసరికి రోజంతా ఏం చేశామన్నది గుర్తుచేసుకునే టైమ్ కూడా ఉండదు. కానీ శృతి అలాకాదంట. ప్రతీరోజు నిద్రకు ఉపక్రమించే ముందు అన్నీ గుర్తుచేసుకుంటా. అలా గుర్తుచేసుకునే క్రమంలో.. ప్రధానంగా రెండు విషయాలు బాగా గుర్తుంచుకుంటా. ఒకటి.. ఆరోజు అయిష్టంగా ఏదైనా పని చేసి ఉంటే.. ఇక జీవితంలో దాని జోలికి వెళ్లను. రెండు.. అకారణంగా ఎవరినైనా బాధపెట్టి ఉంటే.. మళ్లీ తప్పు రిపీట్ చేయకూడదని బలంగా నిశ్చయించుకుంటాను. ప్రతీరోజూ ఇలా సెల్ఫ్ చెక్ చేసుకోకపోతే నాకు నిద్రపట్టదు. ఇంత మంచి అలవాట్లు అలవడానికి తన నాన్నే కారణమంటున్నారు శ్రుతీహాసన్. 'ఇదంతా నాన్న వల్లే. ఎప్పుడైనా ప్రశాంతంగా నిద్రపోలేదంటే.. ఆరోజు నువ్వేదో చేయకూడదని పని చేసి ఉంటావ్.. జీవితంలో ఇక మళ్లీ పని చేయవద్దు' అన్న సూత్రాన్ని పదేపదే చెప్పేవారట. వ్యక్తిగతంగా మన తప్పొప్పుల్ని ఆత్మపరిశీలన చేసుకోవడం అత్యవసరం. మన వ్యక్తిత్వాన్ని మరింత ఇనుమడింపజేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది' అని చెప్పుకొచ్చింది.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page