బిగ్ బాస్ లో శృతి హడావిడి!

shruthi haassan in bigg boss house
Highlights

బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా బిగ్ బాస్ షోకి మంచి ఆదరణ లభిస్తోంది

బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా బిగ్ బాస్ షోకి మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగులో ఇప్పుడిప్పుడే ఈ షోకి మాసాలా యాడ్ చేస్తున్నారు. ఇక కోలివుడ్ లో అయితే ఏకంగా పోటీదారుల మధ్య  లిప్ లాక్ లు కూడా సాగుతున్నాయి. తమిళ బిగ్ బాస్ కు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ షోలో హీరోయిన్ శ్రుతిహాసన్ కూడా పాల్గొంది.

ఈ షోలో 'విశ్వరూపం2' సినిమా పాటలు విడుదల చేసి హైప్ క్రియేట్ చేశారు. కమల్, శ్రుతి ఇద్దరూ కలిసి ఓ పాట కూడా పాడారు. వీరి పాటకు ఆడియన్స్ నుండి మంచి స్పందన లభించింది. షోలో పాల్గొన్న శ్రుతి తన తండ్రి గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఎంత బిహీగా ఉన్నప్పటికీ సినిమాలకు గుడ్ బై చెప్పకూడదని శ్రుతి తన తండ్రిని కోరింది. అసలు ఆ ఆలోచనను మానుకోవాలనిచెప్పడంతో ఆమెకు మద్దతుగా మరికొందరు ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు.

దానికి సమాధానంగా కమల్.. యువ నటులు తమిళ ఇండస్ట్రీను ముందుకు నడపడానికి కృషి చేయాలి అంటూ చెప్పుకొచ్చారు. సినిమాల విషయానికొస్తే.. విశ్వరూపం2 సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 'శభాష్ నాయుడు' సినిమా మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. 

loader