గత కొంతకాలంగా శ్రీయ రష్యాకు చెందిన ఆండ్రీ కోచీవ్ తో రహస్య ప్రేమాయణం సాగిస్తోంది. పెళ్లిగురించి ప్రస్తావన తీసుకువస్తే పెళ్లి లేదు ప్రేమలేదు అంటూ తప్పించుకుతిరిగేది. తాజాగా శ్రీయ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. రష్యన్ ప్రియుడిని తన నివాసంలోనే వివాహం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.శ్రీయ శరన్ సౌత్ లో టాప్ హీరోయిన్ గా చాలా కాలం కొనసాగింది. శ్రీయ నటించిన పలు చిత్రాలు ఘానా విజయం సాధించాయి. ఇష్టం చిత్రంతో శ్రీయ టాలీవుడ్ కు పరిచయం అయింది. తక్కువ టైంలోనే శ్రీయ టాలీవుడ్ లో బడా హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.శ్రీయ శరన్ రష్యాకు చెందిన టెన్నిస్ ఆటగాడు ఆండ్రీ కోచీవ్ తో చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తోంది. శ్రీయ అతడితో సహజీవనం చేస్తున్నట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి.

పెళ్లి వార్తలని ఇటీవల ఖండించిన శ్రీయ తాజాగా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ముంబై లోని తన నివాసంలో ప్రియుడిని రహస్య వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది మిత్రుల సమక్షంలోనే ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది.తన పెళ్ళైన విషయాన్ని శ్రీయ అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే శ్రీయ సోషల్ మీడియా ద్వారా తన వివాహ వార్తని అభిమానులతో పంచుకునే అవకాశం ఉంది.