Asianet News TeluguAsianet News Telugu

#Kantara: ఆస్కార్ కు 'కాంతార' .. రిషబ్ శెట్టి ఏమంటారంటే

ఈ మధ్య కాలంలో ఎక్కువమంది మాట్లాడుకున్న సినిమాలలో 'కాంతార' ఒకటి. కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన ఈ సినిమా, తొలి ఆటతోనే అక్కడ తన దూకుడు చూపడం మొదలుపెట్టింది.

Should Kantara go to Oscars? Here s what Rishab Shetty stated
Author
First Published Nov 2, 2022, 6:17 AM IST

రిషబ్ శెట్టి హీరోగా కన్నడలో రూపొందిన 'కాంతార' సెప్టెంబర్ 30వ తేదీన అక్కడ విడుదలైంది. హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించిన  ఈ సినిమాకి రిషబ్ శెట్టి రచయిత .. దర్శకుడు కూడా. మార్నింగ్ షోతోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఆ రోజు నుంచి వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకు వెళుతోంది. 8 రోజుల్లో 50 కోట్లను .. 15 రోజుల్లో 100 కోట్లను రాబట్టిన ఈ సినిమా,  23 రోజుల్లో 200 కోట్ల మార్కును అందుకుంది.

ఈ సినిమాకు చివరి నిముషాలు హైలెట్ గా నిలిచింది. అది చూసిన ఎవరైనా రిషబ్ శెట్టి ని పొగడకుండా ఉండలేదు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఆస్కార్ కు వెళ్లే అవకాసం ఉందంటూ ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో ఈ సినిమాని ఆస్కార్ కు పంపితే ఖచ్చితంగా వర్కవుట్ అవుతుందంటూ జనం పోస్ట్ లు పెడుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ లాగే ఈ సినిమాని ఆస్కార్ కు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై రిషబ్ శెట్టి రీసెంట్ ఓ ఇంటర్వూలో మాట్లాడారు. ఆయన ఏమంటారో చూద్దాం.

రిషబ్ శెట్టి మాట్లాడుతూ...“నేను దాని గురించి స్పందించను. నేను దాని గురించి 25000 ట్వీట్లను చూశాను. ఇది నాకు సంతోషాన్నిస్తుంది కానీ నేను దానిపై వ్యాఖ్యానించను. ఎందుకంటే ఈ విజయం కోసం నేను పని చేయలేదు. నేను పని కోసం పనిచేశాను. అంతే," అన్నారు.
 
భాక్సాఫిస్ విజయం గురించి మాట్లాడుతూ...కాంతారా ఆ స్దాయి విజయం సాధిస్తుందని తను ఊహించలేదు అన్నారు."నేనైతే అసలు అంచనా వేయలేదు. ఇది అలా జరిగిపోయింది. సినిమాకి  ప్రత్యేక స్ఫూర్తి,  మేము చిత్రంలో మన సంస్కృతి మరియు జానపద కథలను చర్చించాము. అందుకే దేవుడి దీవెనలతో సినిమాని ఇండియా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేశారనుకుంటున్నాను.," అని వివరించారు.

ఈ మధ్య కాలంలో ఎక్కువమంది మాట్లాడుకున్న సినిమాలలో 'కాంతార' ఒకటి. కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన ఈ సినిమా, తొలి ఆటతోనే అక్కడ తన దూకుడు చూపడం మొదలుపెట్టింది. కన్నడలో అత్యంత వేగంగా అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. తెలుగులో ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన విడుదల చేస్తే, అంతకంటే ఒక రోజు ముందుగా హిందీలో విడుదల చేశారు. 

తెలుగులో ఈ సినిమా 10 రోజులలో 27 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేస్తే, హిందీలో 24 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టింది. ఈ సినిమాలోని ఆర్టిస్టులు ఇటు తెలుగులోగానీ .. అటు హిందీలో గాని పెద్దగా ఎవరికీ తెలియదు. అయినా కంటెంట్ తో కట్టిపడేసింది. కథాకథనాల్లోని కొత్తదనం ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. అలా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

తెలుగు  విషయానికే వస్తే, దీపావళికి నాలుగు సినిమాలు థియేటర్లలో దిగిపోయాయి. అప్పటికే 'కాంతార' వచ్చి వారం రోజులు కావడంతో, ఇక ఆ సినిమా వసూళ్లు తగ్గుతాయని చాలామంది భావించారు. కానీ ఆ నాలుగు సినిమాల పోటీని కూడా 'కాంతార' తట్టుకుని నిలబడింది. కొత్తగా వచ్చిన సినిమాలు కొన్ని డీలాపడినా, 'కాంతార' మాత్రం తన జోరును కొనసాగిస్తూ ఉండటం విశేషం.  దగ్గరలో పోటీ ఇవ్వగలిగే సినిమాలు ఏమీ లేకపోవడం వలన, వసూళ్ల పరంగా ఈ సినిమా జోరు మరి కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా సప్తమి గౌడ అలరించిన సంగతి తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios