షాకింగ్.. పనిమనిషిని చంపబోయిన రణ్ బీర్ కపూర్

Shocking: Ranbir Kapoor once almost killed his maid, here are the details
Highlights

బాలీవుడ్ షాకింగ్ న్యూస్

బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ తమ ఇంటి పనిమనిషిని చంపాలని ప్రయత్నించాడా..?  ఈ మాట చెబుతుంది మరెవరో కాదు ఆయన తల్లి నీతూ కపూర్.  ఆమె స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. నిజంగానే రణ్ బీర్ తమ పనిమనిషి చంపాలని చూసాడట. ఆల్ మోస్ట్ ఆమె చనిపోయిందనే భావించారట వారంతా.. కానీ అదృష్టవశాత్తు  ఆమె ప్రాణాలతో బయటపడింది.

ఇంతకీ అసలు విషయం ఏమింటే.. రణ్ బీర్ తల్లి నీతూ కపూర్ ఇటీవల ఫస్ట్ పోస్టుకి ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనిలో తమ కుమారుడు గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 

రణ్ బీర్ ఓసారి తమ ఇంటి పనిమనిషిని స్విమ్మింగ్ పూల్ లోకి తోసేసాడట. ఆమెకు స్విమ్మింగ్ రాదు అన్న విషయం తెలిసి కూడా అలా చేశాడట. ఆమె తన ప్రాణాలు కాపాడుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేస్తుందో తెలుసుకునేందుకు అలా చేశాడట. అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయపడింది. ఇలాంటి తుంటరి పనులు చిన్నప్పుడు రణ్ బీర్ చాలానే చేశాడని ఆమె వివరించారు.

రణ్ బీర్ ప్రస్తుతం హీరో సంజయ్ దత్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న  సంజు సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. 

loader