పవన్ కళ్యాణ్ వీరాభిమానుల్లో ఒకరు శివబాలాజీ కాటమరాయుడులో పవన్ కు తమ్ముడిగా నటిస్తున్న శివబాలాజీ జనసేనానికి అద్భుత ఖడ్గం తయారు చేయించి గిఫ్ట్ గా ఇచ్చిన శివబాలాజీ
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు హీరో శివబాలాజీ పెద్ద ఫ్యాన్. ప్రస్తుతం ‘కాటమరాయుడు’ చిత్రంలో పవన్ కల్యాణ్‌కు తమ్ముడిగా నటిస్తున్నాడు. అయితే ఎప్పటి నుంచో పవన్‌కు బహెుమతిగా ఏదైనా ఇద్దామని అనుకుంటున్న శివబాలాజీ జనసేనానికి ఖడ్గం ఇవ్వాలనుకున్నాడట. అయితే ఆ ఖడ్గం కూడా ప్రత్యేకంగా ఉండాలని దానిపై జనసేనాని చిత్రాన్ని, ఆ ఖడ్గం చివరిలో జనసేన పార్టీ జెండాలోని లోగోను రూపొందించాడు బాలాజీ. ఇందుకోసం డెహ్రడూన్‌లో తనకు తెలిసిన ఖడ్గ తయారీదారుడిని కలిసి, దానిపై ఎలాంటి డిజైన్ వేయాలో వివరించాడట.
దానిపై పవర్‌ఫుల్ పదాలుండేలా పవన్ కళ్యాణ్ రూపం, దానికింద ‘జనసేన’ అని ఇంకా చెప్తున్నాడట.. ఇలా తాను చెప్పుకొంటూ పోతుండడంతో డిజైనర్‌కి విసుగుపుట్టి సర్ ఇలా చెప్పుకుంటూ పోతే పని అవ్వదు అని అతనితో అన్నాడని తన ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు శివబాలాజీ. దీన్ని ఎంతో ప్రత్యేకంగా కాటమరాయుడు సెట్లో పవన్‌కు అందించాడు.
సెట్ లోనే నిర్మాత శరత్ మరార్, ఆలీ,ఎఎం రత్నం, శివబాలాజీ, అజయ్ తదితరులు ఖడ్గాన్ని చూసి పవన్ తో దాని గురించే తెగ చర్చించారట. మొత్తంగా చిత్ర యూనిట్ అంతా పవన్‌ను సర్‌ప్రైజ్‌లో ముంచేసింది. దానికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు నిర్మాత శరత్ మరార్. మీరూ ఓ లుక్కేయండి.

