ఒక సినిమాకి హిట్ అవ్యాలంటే కథ, కథనం,డైరెక్షన్, సాంగ్స్, డాన్స్ ఇలా చాలా ఉంటాయి.అన్ని సమ పాళ్లలో ఉంటేనే అవి హిట్ అవుతాయి. ముఖ్యంగా మన తెలుగు సినిమాల్లో సాంగ్స్ కి డాన్స్ లకి క్రేజ్ ఎక్కువే. మనకు తెలుగులో డాన్స్ మాస్టర్స్ అంటే గుర్తొచ్చే వాళ్లు ప్రభుదేవా, లారెన్స్, ప్రేమ్ రక్షిత్ ఇలా చాలే మందే ఉన్నారు. ఇప్పటి జనరేషన్  టాప్ లో దూసుకుపోతున్న డాన్స్ మాస్టర్ శేఖర్. ప్రతి టాప్ హీరో ఫేవరేట్ డాన్స్ మాస్టర్ శేఖర్ అనే అంటారు. అతను చేసిన సాంగ్స్ చాలా వరకు సూపర్ హిట్టే. రీసెంట్ ఆయన ఫేస్ బుక్ లైవ్ లో తన అనుభవాల్ని, తను ఇండస్ట్రీ లో ఎంత స్ట్రగుల్ అయ్యాడో చెప్పుకొచ్చాడు. లైవ్ లో తనకి రాకేష్ మాస్టర్ కి గొడవేంటి అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... రాకేష్ మాస్టర్ నాకు అన్న లాంటి వాడని తనను వచ్చిన కొత్తలో సోంత మనిషిలా చూసుకునే వాడని చెప్పుకొచ్చాడు.

 

తనకు ఆఫర్లు వచ్చిన తర్వాత నేను బిజీ అయ్యాను. ఎందుకో ఎంటో మాస్టర్ ఒక రోజు నన్ను తాగేసి బూతులు తిట్టాడు. మా అమ్మని కూడా తిట్టాడు.అలాగే రెండు మూగుసార్లు రిపీట్ చేశాడు. ఒకసారి ఇంటికి పిలిచి అలానే తిట్టాడు. భాధ వేసి ఇంటి నుండి బయటకు వచ్చేశా. ఆ మాటలు మాట్టాడడానికి కూడా చాలా నీచంగా ఉంటుదంటు చెప్పుకొచ్చాడు. మాకు ఆరు నెలలు తినడానికి తిండి కూడా లేని సమయంలో కిరణ్ అనే ఫ్రెండ్ తనకు ఛాన్స్ ఇప్పిచ్చాడని. అతను రుణం మర్చిపోలేనంటు చెప్పుకొచ్చాడు.