రయీస్ సినిమా ప్రమోషన్‌ కోసం రాజ్‌ థాక్రేతో భేటి అయ్యిన షారుక్ ఖాన్ సినిమా విడుద‌ల‌కి అడ్డుప‌డొద్ద‌ని రాజ్ థాక్రే ని అడిగిన బాలీవుడ్ హిరో దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికుల కోసం 5 కోట్లు విరాళంగా ఇవ్వ‌ల‌ని కండీష‌న్ పెట్టిన రాజ్ థాక్రే
ఎందుకిలా.? అంటే, అందరికీ తెల్సిన విషయమే.. పాకిస్తాన్ - భారత్ మధ్య నెలకొన్న యుద్ధ మేఘాల నేపథ్యంలో పాకిస్తానీ నటీనటులు నటించిన సినిమాలపై కత్తులు దూసింది ఎంఎన్ఎస్. ఆ తర్వాత కాస్త మెత్తబడిందనుకోండి.. అది వేరే విషయం. ఈ క్రమంలో ముందుగా ఇబ్బంది పడిన సినిమా 'యే దిల్ హై ముష్కిల్'. ఇందులో పాకిస్తానీ నటుడు ఫవాద్ నటించాడు.
'నటుల మీదనే బ్యాన్ ఎందుకు.? వాళ్ళకు భారత ప్రభుత్వమే కదా వీసా ఇచ్చింది..' అంటూ కరణ్ జోహార్ చేసిన వ్యాఖ్యలతో వివాదం ముదిరి పాకాన పడింది. ఎలాగోలా మహారాష్ట్ర ప్రభుత్వం, కరణ్ జోహార్కీ - రాజ్థాక్రేకీ మధ్య సయోధ్య కుదిర్చిందనుకోండి.. అది వేరే విషయం.'పాకిస్తాన్ నటీనటులు నటించిన సినిమాలు ఇండియాలో విడుదలవ్వాలంటే దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికుల కోసం 5 కోట్ల రూపాయలు ఆయా సినీ నిర్మాతలు విరాళంగా ఇవ్వాలి..' అని రాజ్ థాక్రే ఓ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
అది 'అధికారికంగా' అమలవుతోందా.? లేదా.? అన్నది వేరే విషయం. తెరవెనుక మాత్రం, ఈ 'కప్పం' కట్టడం అనేది జరుగుతోందంటూ సినీ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇప్పుడు షారుక్ ఆ కప్పం కట్టడానికే రాజ్ థాక్రేని కలిశారన్నది తాజా గాసిప్. ‘రయీస్‘లో పాకిస్తానీ నటి మహిరాఖాన్ నటించడమే షారుక్ తలనొప్పికి కారణం. ఇంతకీ, షారుక్ కప్పం కట్టాడన్న వార్తలు నిజమేనా.?
