Asianet News TeluguAsianet News Telugu

బాహుబలి 2లో సూపర్ స్టార్

  • బాహుబలి 2లో సూపర్ స్టార్
  • సస్పెన్స్ పెట్టిన రాజమౌళి
  • కీలక పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ నటించినట్లు సమాచారం
shar rukh khan in BAHUbali

ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించిన బాహుబలి -2 లో బాలీవుడ్‌  సూపర్ స్టార్  అతిధి  పాత్రలో అలరించనున్నాడా.. అంటే అవుననే అంటోంది జాతీయ మీడియా. బాహుబలి-2 మూవీ రిలీజ్ కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న బాహుబలి -2 కి  సంబంధించిన ఓ కొత్త విశేషం  ఇపుడు హల్‌ చల్‌ చేస్తోంది.   ఓ జాతీయ వెబ్ సైట్ అందించిన సమాచారం ప్రకారం  బాలీవుడ్ సూపర్‌స్టార్‌ షారుఖ్ ఖాన్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడట. అయితే ఈ వార్తలపై ఇటు బాహుబలి దర్శకుడు జక్కన్న కానీ, అటు షారూక్‌ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

 

బాహుబలి మూవీ ఫస్ట్ పార్ట్ టాలీవుడ్ చరిత్రలోనే కాకుండా ఇండియన్ స్క్రీన్ పై ఓ విజువల్ వండర్‌గా నిలిచిపోయింది.  2015లో  కలెక్షన్‌ల సునామీ సృష్టించిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.600కోట్లకు పైగా  వసూళ్లను రాబట్టింది. దీని పార్ట్ 2 అయిన బాహుబలి-2 (ది కన్‌క్లూజన్‌) ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్  పనులను శరవేగంగా  పూర్తి చేసుకుంటోంది.   ఏప్రిల్‌  28న ఈ మూవీ థియేటర్లను పలకరించనుంది. 

 

మరోవైపు బాహుబలిని మించి మరింత  ప్రతిష్టాత్మకంగా బాహుబలి -2 తెరకెక్కిస్తున్నట్టు  ఇటీవల రాజమౌళి ప్రకటించి  మరింత  ఉత‍్కంఠను రేకెత్తించారు.  ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌ లో ఉన్న  బాహుబలి -2 పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ముఖ్యంగా  కట్టప్ప బాహుబలిని ఎందుకు  చంపాడన్న  దానిపై భారీ హైప్‌  క్రియేట్‌ అయింది. ఇక షారుఖ్ కూడా బాహుబలి2లో మెరిస్తే.. ఇక ఈసినిమా కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో..

Follow Us:
Download App:
  • android
  • ios