సూపర్ స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసిన అర్జున్ రెడ్డి హీరోయిన్

సూపర్ స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసిన అర్జున్ రెడ్డి హీరోయిన్

అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా చేసిన షాలిని పాండే కు ఎంత గుర్తింపు వచ్చిందో ఆమె నటనకు యూత్ మొత్తం ఫిదా అయిపోయారు. బేబీ అంటూ ముద్దు ముద్దుగా యువత లవ్ లో పడేసింది. అసలు మ్యాటర్ లోకి వస్తే షాలిని కి ప్రస్తుతం మంచి ఆఫర్స్ అందుతున్నాయి. 

షాలిని ప్రస్తుతం సావిత్రి బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో కూడా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మహేష్ తన 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒకే చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో పూజ హెగ్దే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. మరో ముఖ్యమైన లేడి క్యారెక్టర్ కోసం దర్శకుడు షాలిని పాండే ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఇంకా అధికారికంగా చిత్ర యూనిట్ ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు గాని దాదాపు ఆమెను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ భరత్ అనే నేను సినిమా డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ నెల 20న భరత్ అనే నేను సినిమా రిలీజ్ కాబోతోంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos