ఇద్దరు అబ్బాయిలతో రూమ్ షేర్ చేసుకుందట!

First Published 28, May 2018, 12:19 PM IST
shalini pandey about her male roommates
Highlights

'అర్జున్ రెడ్డి' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది షాలిని పాండే..

'అర్జున్ రెడ్డి' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది షాలిని పాండే.. ఈ సినిమా నటిగా తనకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. థియేటర్ ఆర్టిస్ట్స్ పాత్ర కోసం ఏమైనా చేస్తారని దర్శకుడు ఆమెను ఏరికోరి మరీ 'అర్జున్ రెడ్డి'లో ఆమెను హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ సినిమాతో షాలిని తెలుగులో బిజీ హీరోయిన్ అయిపోయింది. ఇటీవల విడుదలైన 'మహానటి'లో ముఖ్య పాత్ర పోషించింది.

ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి. అయితే షాలిని సినిమాల్లోకి రావడం ఇంట్లో వారెవరికీ ఇష్టం లేదట. తన తండ్రి ఏదైనా ఐటీ జాబ్ చేసుకోమని చెబితే దానికి షాలిని అంగీకరించకపోవడంతో ఆమెపై మండిపడ్డారట. దీంతో ఇంట్లో నుండి వచ్చేసిన షాలిని ముంబైలో తన స్నేహితుల వద్దకు వెళ్లగా.. అక్కడ వారితో కలిసి ఉండే అవకాశం లేకపోవడంతో ఇద్దరు అబ్బాయిలున్న రూమ్ లో అడ్జస్ట్ కావాల్సివచ్చిందట.

ముంబైలో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఉండడం కామన్ అని వారిద్దరూ తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని ఎప్పుడూ కూడా తనతో అనుచితంగా వ్యవహరించలేదని వారి కారణంగానే ప్రపంచాన్ని కొత్తగా చూడడం అలవాటు చేసుకున్నట్లు స్పష్టం చేసింది. ఇక సౌత్ లో అవకాశాలు రావడంతో హైదరాబాద్ కు షిఫ్ట్ అయినట్లు చెప్పారు. కానీ ఆ ఇద్దరు స్నేహితులనూ ఎప్పటికీ మరచిపోనని వారిని గుర్తు చేసుకుంది! 

loader