అవును పవన్ నన్ను తిట్టారు : షకలక శంకర్

First Published 10, Jul 2018, 3:17 PM IST
Shakalaka shankar about pawan
Highlights

జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న కమెడియన్లలో షకలక శంకర్ ఒకడు. స్వతహాగా అతను చిరంజీవి, పవన్ కి వీరాభిమాని. ఈ మధ్య శంభోశంకర అని ఒక డిజాస్టర్ సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 

జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న కమెడియన్లలో షకలక శంకర్ ఒకడు. స్వతహాగా అతను చిరంజీవి, పవన్ కి వీరాభిమాని. ఈ మధ్య శంభోశంకర అని ఒక డిజాస్టర్ సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పవన్ ఫ్యాన్స్ పావలా వంతు చూస్తే చాలు నా సినిమాకు 60 కోట్లు వస్తుంది అంటు చెత్త కామెంట్లు చేసి విమర్శలపాలయ్యాడు. ఆ మధ్య పవన్ తో కలిసి చేసిన ఒక సినిమా షూటింగులో డైరెక్షన్ డిపార్ట్ మెంట్ పై షకలక శంకర్ నోరు పారేసుకున్నాడనీ, దాంతో పవన్ మందలించాడనే టాక్ వచ్చింది. కారణం ఏమైవుంటుందనే ఆసక్తి ఇప్పటికీ చాలామందిలో వుంది.

 తాజాగా ఒక షో లో ఈ విషయం గురించి అతను స్పందించాడు... "నేను ఆ సినిమా ఒప్పుకున్నదే పవన్ కల్యాణ్ ను దగ్గర నుంచి చూడటానికి. ఏ సీన్ చెబుతున్నారని గానీ .. ఎలా చేయాలని గాని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పవన్ ని అలా చూస్తూ ఉండేవాడిని .. అయినా తనివి తీరేది కాదు. ఆ సినిమాకి తీసిన సీనే మళ్లీ మళ్లీ తీస్తుండేవాళ్లు.

దాంతో పవన్ డబ్బు అనవసరంగా ఖర్చు అవుతూ ఉండేది. అది తట్టుకోలేక కో డైరెక్టర్ పై అరిచాను. ఆ విషయం తెలిసి పవన్ నన్ను పిలిపించారు. 'ఏరా అప్పుడే డైరెక్టర్ ను .. కో డైరెక్టర్ ను అనే రేంజ్ కి వచ్చేశావురా నువ్వు .. వాళ్లు ఎన్నిసార్లు తీస్తే నీకెందుకు .. నీకు అవసరమా? నీ హద్దుల్లో నువ్వుండు .. పనిచేసుకుని పో .. అర్థమైందా .. పో' అన్నారు. ఆ రోజున జరిగింది ఇదే' అంటూ స్పష్టం చేశాడు.  

loader