Asianet News TeluguAsianet News Telugu

సైరాలో నటించనున్న సీనియర్ రాజకీయ నాయకురాలు

  • మెగాస్టార్ చిరు హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కననున్న సైరా నరసింహారెడ్డి
  • కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై 200కోట్ల భారీ బడ్జట్ తో తెరకెక్కనున్న మూవీ
  • సురెందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నటించనున్న రాజకీయ నాయకురాలు

 

senior heroine vijayashanthi or jayaprada roped in for chiru sye raa

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై స్టైలిష్ డైరెక్టర్ సురెందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మెగా స్టార్ 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి కోసం మెగా అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం.150 కంటే... ఈ సైరా పై అంచనాలు బాగా పెరిగిపోయాయి. చిరు తన కెరీర్ లో ఫస్ట్ టైమ్... ఓ బయోపిక్ లో కనిపించబోతున్నారు.

 

తాజా సమాచారం ప్రకారం గతంలో చిరుతో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఓ ప్రముఖ నటి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనుందట. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం  ఫస్ట్ లుక్ ను చిరు బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేశారు. ఐతే ఇందులో చిరును బ్యాక్ నుండి చూపించారే కానీ.. చిరు ఫేస్ మచ్చుకైనా కనిపించలేదు. దీంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గెటప్ లో చిరు ఎలా ఉంటాడోననే ఆసక్తి ఫ్యాన్స్ లో మాత్రమే కాక సర్వత్రా నెలకొంది.

 

200 కోట్ల భారీ బడ్జెట్ అంచనాలతో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో చిరుకు జోడీగా నయనతార నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బీ ఇందులో చిరుకు గురువు గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సైరా నరసింహారెడ్డి చిత్ర యూనిట్ లో చిన్న మార్పులు జరిగినట్లు సమాచారం. ఇందులో పనిచేసే సినిమాటోగ్రాఫర్ ను మార్చారని తెలుస్తోంది.

 

ఇక తాజాగా సైరాకు సంబంధించిన మరో న్యూస్ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ఒకప్పుడు చిరుకు జోడీగా నటించి రాజకీయాల్లో వెలిగిన ఆ నటీమణి ఇప్పుడు మళ్లీ సినిమాలపై ఆసక్తి కనబరుస్తోందని... సైరా మూవీలో ఆ నటి ఓ కీలక పాత్రలో నటిస్తోందని ఫిలింనగర్ సర్కిల్ లో తెగ చర్చ జరుగుతోంది. ఆ నటి ఎవరా అనే దానిపై కూడా ఆసక్తికర చర్చ మొదలైంది. విజయశాంతి, జయప్రదల పేర్లు వినిపిస్తున్నా ఎవరు అనేది పక్కాగా తెలియడం లేదు. ప్రస్థుతానికి మెగా ఫ్యాన్స్ అంతా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా.. టీజర్, ట్రైలర్ ఎప్పుడొస్తుందా అని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios