Asianet News TeluguAsianet News Telugu

అలీ నాతో కూడా తప్పుగా మాట్లాడాడు.. సీనియర్ నటి కామెంట్స్!

కమెడియన్ అలీ సినిమా ఈవెంట్లకు హోస్టింగ్ చేసే సమయంలో చాలా సార్లు నోరు జారారు. ప్రముఖ హీరోయిన్లు అనుష్క, సమంతల మనసులు నొచ్చుకునే విధంగా గతంలో కామెంట్స్ చేశారు. తాజాగా 'లవర్స్ డే' ప్రీరిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమపై అలీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 

senior actress divyavani comments on comedian ali
Author
Hyderabad, First Published Jan 27, 2019, 5:01 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కమెడియన్ అలీ సినిమా ఈవెంట్లకు హోస్టింగ్ చేసే సమయంలో చాలా సార్లు నోరు జారారు. ప్రముఖ హీరోయిన్లు అనుష్క, సమంతల మనసులు నొచ్చుకునే విధంగా గతంలో కామెంట్స్ చేశారు.

తాజాగా 'లవర్స్ డే' ప్రీరిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమపై అలీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సుమ భర్త రాజీవ్ పై అలీ సరదాగా చేస్తున్నాననుకొని చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు సీరియస్ గా మారాయి. రాజీవ్ కేరళలోరెండో ఫ్యామిలీ పెట్టినట్లుగా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడాడు అలీ. 

ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ నటి దివ్యవాణి స్పందించింది. అలీ అలా మాట్లాడిన సమయంలో సుమకు అలీని నరికేయాలన్నంత కోపం వచ్చి ఉంటుందని, కానీ ఏం చేయలేక ఆగిపోయి ఉంటుందని దివ్యవాణి చెప్పుకొచ్చింది.

అలీ తనతో కూడా తప్పుగా ప్రవర్తించినట్లు దివ్యవాణి వెల్లడించింది. అలీ నిర్వహించే 'అలీతో జాలీగా' షోలో పాల్గొన్నప్పుడు 'మీరు 16ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను కూడా ఉండి ఉంటే వెంటపడేవాడినంటూ' అలీ కామెంట్ చేశాడని దివ్యవాణి గుర్తుచేసుకొని.. ఇలాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉంటే మనసులో దాచుకోవాలని అవతలి వారి అభిప్రాయాలు పట్టించుకోకుండా అలీ మాట్లాడుతుంటాడని చెప్పుకొచ్చింది. 

మరోసారి నోరు జారిన అలీ.. ఈసారి సుమ బలైంది!

Follow Us:
Download App:
  • android
  • ios