టాలీవుడ్ కమెడియన్ అలీకి ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం టీవీ షోలతో కాలం గడుపుతున్న అతడు త్వరలోనే రాజకీయాల్లోకి వెళ్లబోతున్నాడు. తాజాగా అలీ 'లవర్స్ డే' ఆడియో లాంచ్ లో యాంకర్ గా కనిపించారు.

సుమతో కలిసి కార్యక్రమాన్ని హోస్ట్ చేశారు. సాధారణంగా ఇలాంటి ఫంక్షన్స్ లో అలీ నోరు జారడం ఆ తరువాత విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. గతంలో సమంత, అనుష్కలపై నోరు జారిన అలీ తాజాగా యాంకర్ సుమ కుటుంబంపై పంచ్ లు వేశాడు. కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ ప్రియా ప్రకాష్ ని వేదికపైకి పిలిచిన సుమ ఆమెని తన చెల్లెలుగా అభివర్ణించింది.

సుమ కూడా కేరళ వాసి కావడంతో మలయాళీ కుట్టి అయిన ప్రియాను తన సోదరి అంటూ మాట్లాడింది. అదే సమయంలో మైక్ అందుకున్న అలీ 'ప్రియా వారియర్ నీ చెల్లెలు ఓకే.. మరి హీరో రోషన్ మీ కొడుకా' అని సుమని ప్రశ్నించాడు.

 దానికి సుమ కొడుకు లాంటివాడే అని బదులిచ్చింది. అప్పుడు అలీ.. 'రాజీవ్ కేరళ ఎప్పుడు వెళ్లాడు. ఇంత పెద్ద కొడుకు ఉన్నాడు' అని సుమ భర్త రాజీవ్ కనకాలపై అభ్యంతరకర కామెంట్స్ చేశాడు.విషయం పెద్దది కాకుండా వెంటనే సుమ టాపిక్ డైవర్ట్ చేసేసింది.