నటుడిగా ఆరు దశాబ్దాలకు పైగా పరిశ్రమకు సేవలు అందించిన జీకే పిళ్ళై (GK Pillai) తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.
భారత రక్షణ దళంలో 13 ఏళ్ళు పని చేసిన జీకే పిళ్ళై నటనపై మక్కువతో రిటైర్మెంట్ ప్రకటించి నటుడిగా మారారు. 1954లో ఆయన నట ప్రస్థానం మొదలు కాగా... రెండేళ్ల క్రితం వరకు కూడా నటుడిగా సేవలు అందించారు. మలయాళ చిత్ర పరిశ్రమలో కురువృద్దిగా వందల కొద్ధి సినిమాలు, సీరియల్స్ లో నటించారు. జీకే పిళ్ళై వయసు 97 ఏళ్లుగా తెలుస్తుంది. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఆయన శుక్రవారం కన్నుమూశారు.
300లకు పైగా సినిమాల్లో నటించిన జీకే పిళ్ళై భిన్న పాత్రలు పోషించారు. మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ విలన్ గా గుర్తింపు పొందారు. ఆకట్టుకునే నటనకు తోడు గంభీరమైన వాయిస్.. ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అనేక అవార్డ్స్, రికార్డ్స్ గెలుపొందడానికి కారణమైంది. రాజకీయాలలో కూడా జీకే అడుగుపెట్టారు. ఆయన కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడిగా ఉన్నారు.
Also read RRR:“ఆర్ఆర్ఆర్” కోసం సీఎంను ప్రశ్నిస్తూ నిర్మాత ట్వీట్!
గతంలో జీకే భార్య మరణించడం జరిగింది. ఆయనకు ఆరుగురు సంతానం. కేరళ కాపిటల్ సిటీ తిరువనంతపురానికి చెందిన జీకే పిళ్ళై అంత్యక్రియలు అక్కడే నేడు నిర్వహించనున్నారు. ఇక జీకే పిళ్ళై మరణవార్త తెలుసుకున్న మలయాళ చిత్ర ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
