‘‘భావోద్వేగం, విప్లవం, భారతీయ సంస్కృతి.. వీటి సమ్మేళమనమే ‘ఆర్‌ఆర్‌ఆర్’. అంత రెడీ అయ్యాక రిలీజ్ ఆగిపోవడానికి పెద్ద కారణం. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంటూ జనాలని భయపెట్టిన కరోనా మహమ్మారి.. థర్డ్ వేవ్ మళ్ళీ ఎంటర్ అయ్యింది.. 

ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ ఇద్దరు హీరోలతో రాజమౌళి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే డిల్లీలో థియోటర్స్ ని పూర్తి స్దాయిలో మూసేసారు. అక్కడ నుంచి రావాల్సిన రెవిన్యూ మొత్తం లాస్ అవుతుంది. ఈ విషయమై నిర్మాత, హిందీ డిస్ట్రిబ్యూటర్ నిరాశలో ఉన్నారు. దాంతో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు, పంపిణీదారుడు కరుణ్ జోహార్ ఈ విషయాన్ని పరిష్కరించటానికి తన వంతు ప్రయత్నం మొదలెట్టారు. అందులో భాగంగా ఓ ట్వీట్ చేసారు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. 

సినిమా ధియేటర్లను ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వాలని, ధియేటర్లు ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంచుతున్నారని, ఇతర బహిరంగ ప్రదేశాలతో పోలిస్తే థియేటర్లలో కోవిడ్ నిబంధనలు బాగా అమలవుతున్నాయని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరియు సీఎం కార్యాలయానికి ట్యాగ్ చేస్తూ ‘సినిమాలు సేఫ్’ అనే హ్యాష్ టాగ్ ను వినియోగించారు. 

Scroll to load tweet…

ఇక ‘‘భావోద్వేగం, విప్లవం, భారతీయ సంస్కృతి.. వీటి సమ్మేళమనమే ‘ఆర్‌ఆర్‌ఆర్’. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌ కారణంగా ఈ ప్రాజెక్టు లార్జర్‌ దేన్‌ లైఫ్‌గా అవతరించింది. నా భార్య రమ (కాస్ట్యూమ్‌ డిజైనర్‌) మినహా ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు ఇతర రాష్ట్రాలకు చెందినవారు. పాన్‌ ఇండియా అంటే ఇదేనేమో’’ అని రాజమౌళి అన్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌.. కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. ఆలియాభట్‌, ఒలివియా మోరిస్‌ హీరోయిన్స్. శ్రియ, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించారు. సుమారు రూ. 400 కోట్లతో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా 2022 జనవరి 7న విడుదల కానుంది.