'అర్జున్ రెడ్డి'తో శేఖర్ కమ్ముల!

First Published 17, Jul 2018, 1:07 PM IST
sekhar kammula to direct dhruv
Highlights

ధృవ్ ప్రస్తుతం 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ 'వర్మ' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

మినిమం గ్యారంటీ దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు.ఆయన సినిమాలు రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా కొత్తగా ఉంటాయి. యూత్, ఫ్యామిలీ పల్స్ బాగా తెలిసిన ఈ దర్శకుడు ఏ జోనర్ సినిమా చేసినా.. తనదైన మార్క్ ను మాత్రం మిస్ చేయడు.

గతేడాదిలో ఆయన డైరెక్ట్ చేసిన 'ఫిదా' సినిమా రికార్డ్స్ తిరగరాసింది. అయితే ఈ సినిమా తరువాత శేఖర్ కమ్ముల ఏ హీరోతో సినిమా చేస్తాడనే విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. దిల్ రాజు నిర్మాణంలో సినిమా ఉంటుందని, రానాతో కలిసి పని చేసే ఛాన్స్ ఉందని ఇలా చాలా వార్తలు వినిపించాయి. కానీ శేఖర్ కమ్ముల మాత్రం హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ ను డైరెక్ట్ చేయబోతున్నాడని సమాచారం.

ధృవ్ ప్రస్తుతం 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ 'వర్మ' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒక సున్నితమైన ప్రేమ కథతో తెలుగు, తమిళ భషాల్లో ఈ సినిమా తెరకెక్కనుందట. ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన రానుంది. 

loader