షకలక శంకర్ కోసం బాహుబలి బ్యూటీ!

First Published 27, Jul 2018, 6:01 PM IST
scarlett wilson to do a special song in shakalaka shankar movie
Highlights

ఇప్పటివరకు స్టార్ హీరో సినిమాల్లో నర్తించిన స్కార్లెట్ ఇప్పుడు శంకర్ సినిమాలో డాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా దర్శకుడు రాజ్ సత్య ఐటెం సాంగ్ చేయడానికి ఆమెను సంప్రదించి రిక్వెస్ట్ చేయడంతో పాటు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేశారట

టాలీవుడ్ కమర్షియల్ సినిమాల్లో ఐటెం సాంగ్ కంపల్సరీ.. ఈ పాటను వీలైనంత కొత్తగా తెరకెక్కించి బి, సి ఆడియన్స్ ఆకట్టుకునే పనిలో దర్శకులు బాగానే కష్టపడతారు. దర్శకధీరుడు జక్కన్న సైతం దీనికి అతీతుడు కాదు. పూరి జగన్నాథ్ రూపొందించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాలో ఐటెం సాంగ్ తో టాలీవుడ్ కు పరిచయమైంది స్కార్లెట్ విల్సన్.

ఆ తరువాత బాహుబలి సినిమాలో 'మనోహరీ' అనే పాటలో మెరిసింది. ఈ పాటకు ఆమెకు మంచి పేరే తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్ లో ఐటెం ఆఫర్లు బాగానే వస్తున్నాయి. ఈ క్రమంలో కమెడియన్ షకలక శంకర్ హీరోగా నటిస్తోన్న సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి అంగీకరించి షాక్ ఇచ్చింది ఈ బ్యూటీ. ఇప్పటివరకు స్టార్ హీరో సినిమాల్లో నర్తించిన స్కార్లెట్ ఇప్పుడు శంకర్ సినిమాలో డాన్స్ చేయడానికి రెడీ అవుతోంది.

ఈ సినిమా దర్శకుడు రాజ్ సత్య ఐటెం సాంగ్ చేయడానికి ఆమెను సంప్రదించి రిక్వెస్ట్ చేయడంతో పాటు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేశారట. ఆ కారణంగానే ఆమె ఐటెం సాంగ్ లో నటించడానికి రెడీ అయిందని అంటున్నారు. హీరోగా మారిన షకలక శంకర్ కు హిట్ రాకపోయినా.. తన ప్రయత్నాన్ని మాత్రం మానుకోవడం లేదు. మరి ఈసారైనా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి!

loader