సావిత్రి జీవితంలో తీసుకున్న తప్పుడు నిర్ణయం!

Savitri marrying Gemini Ganesan was a wrong decision
Highlights

అలనాటి కథానాయిక సావిత్రి జీవిత చరిత్రతో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'మహానటి'

అలనాటి కథానాయిక సావిత్రి జీవిత చరిత్రతో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'మహానటి' సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. ఈ సినిమా విడుదలైన తరువాత జెమినీ గణేశన్ కూతురు కమలా సెల్వరాజ్ తన తండ్రిని తప్పుగా చూపించారంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆమె మాటలను సపోర్ట్ చేస్తూ సావిత్రి కూతురు ఛాముండేశ్వరి స్పందించారు. అయితే తాజాగా జెమినీ గణేశన్ సన్నిహితుడు రాజేష్.. సావిత్రి జీవితంలో తీసుకున్న తప్పుడు నిర్ణయం జెమినీ గణేశన్ ను పెళ్లి చేసుకోవడమేనని ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశారు.

''జెమినీ గణేశన్ కు పెళ్లైందని తెలిసిన తరువాత కూడా సావిత్రి ఆయన్ను ఇష్టపడ్డారు. పెళ్లి అయినా చేసుకోకుండా ఉండాల్సింది. గణేశన్ పెళ్లి చేసుకోవడం ఆమె జీవితంలో తీసుకున్న తప్పుడు నిర్ణయం. జెమినీ గణేశన్ జీవితంలో ఉన్న నియమాలు వేరు. కాబట్టి ఆయన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశారు. సావిత్రికి మద్యం అలవాటు చేసింది జెమినీ అని సినిమాలో చూపించారు. గణేశన్ ఆమెను తాగమని చెప్పి ఉంటారు కానీ దానికి ఆమె అలవాటు పడిపోయారు. అది కూడా ఆమె తప్పే'' అంటూ చెప్పుకొచ్చారు.  

loader