అమ్మ తరతరాలకు సరిపడే ఆస్తి ఇచ్చింది-సావిత్రి కూతురు చాముండి
- మహానటి సావిత్రి ఆస్తులపై సంచలన ప్రకటన చేసిన ఆమె కూతురు
- సావిత్రి తమకు తరగని ఆస్తులిచ్చిందని స్పష్టం చేసిన విజయ చాముండేశ్వరి
- అమ్మ జీవిత చరమాంకంలో ఆర్థిక ఇబ్బందులేమీ లేవన్న చాముండేశ్వరి
మహానటి 'సావిత్రి' జీవిత చరమాంకంలో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయా.. అంటే అది కేవలం ప్రచారం మాత్రమేనని,, మరో రెండు తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి తమకు తల్లి దగ్గరినుండే వచ్చిందని మహానటి కూతురు విజయ చాముండేశ్వరిదేవి అంటున్నారు. అమ్మ ఆస్తి పోగొట్టుకుందని గురించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కానీ అవి వాస్తవం కాదంటోంది విజయ.
స్టార్ హీరోయిన్ గా ఉన్నపుడు బాగా సంపాదించిన ఆమె తర్వాత తాగుడుకు బానిసగా మారి జీవితం చివరి దశలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో గడిపిందని, అనారోగ్యానికి చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బు లేక దీనమైన స్థితిలో మరణించిందని ప్రచారం వుంది. అయితే ఈ ప్రచారం అంతా అబద్ధమని అంటున్నారు సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి. అమ్మ ఏ విధమైన ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొలేదని, ఆమె సంపాదించిన డబ్బుతోనే తాము ఇప్పటికీ సుఖంగా బతుకుతున్నామని తెలిపారు.
తన తల్లి కొత్త డబ్బు పోగొట్టుకొన్నమాట నిజమే, కానీ ఆర్థిక ఇబ్బందులు మాత్రం లేవు. తనకు, తన సోదరుడికి చాలా డబ్బు అందజేశారు. ఆమె వల్లే తాము ఇప్పటికీ ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఆర్ధికంగా ఉన్నత స్థితిలో బతుకుతున్నామని తెలిపారు. రెండు తరాలైనా తరగదు తన తల్లి ద్వారా సంక్రమించిన ఆస్తి మరో రెండు తరాలు గడిపినా తరగనంత ఉందని విజయచాముండేశ్వరి చెప్పడం గమనార్హం. తన తల్లి జీవితంపై వస్తున్న ‘మహానటి' సినిమాలో అన్నీ నిజాలే చెబుతారని ఆశిస్తున్నట్లు చాముండేశ్వరి అన్నారు.
తన తల్లి సావిత్రి గురించి భవిష్యత్ తరాలకు వాస్తవాలు తెలియజేసేలా ‘మహానటి' సినిమా తెరకెక్కిస్తున్నారని భావిస్తున్నాను, ప్రచారంలో ఉన్న కల్పితాలను, పుకార్లు ఈ సినిమా ద్వారా మాయం అవుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. అమ్మ(సావిత్రి) జీవితంపై సినిమా తీస్తామని దర్శక నిర్మాతలు తనను సంప్రదించగానే షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు.
తనకు 16 ఏళ్ల వయసులో వివాహం చేశారని, తన వివాహానికి రెండేళ్ల ముందు నుండే అమ్మ సావిత్రి, నాన్న జెమిని గణేషన్ మధ్య విభేదాలు, గొడవలు మొదలయ్యాయని విజయ చాముండేశ్వరి చెప్పుకొచ్చారు. ఇద్దరి మధ్య ఎందుకు గొడవలు వచ్చాయో ఆ వయసులో తనకు అర్థం కాలేదని, వారు గొడవపడ్డప్పటికీ తనతో ప్రేమగా ఉండేవారని విజయచాముండేశ్వరి చెప్పుకొచ్చారు. అమ్మా నాన్నల మధ్య గొడవల ప్రభావం నాపై పడలేదు. కానీ తమ్ముడిపై ఆ ప్రభావం బాగా పడిందని విజయచాముండేశ్వరి చెప్పుకొచ్చారు.
తన తల్లి చాలా అమాయకురాలని, ఏదైనా సమస్య వస్తే ఏం చేయాలో కూడా ఆమెకు తెలిసేది కాదు. అపుడు ఆమెకు సరైన సలహాలు ఇచ్చే వారు కూడా ఎవరూ ఉండేవారు కాదు. ఆ అమాయకత్వంతో తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా నష్టపోయింది, కొన్ని సార్లు చెడు జరిగిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. సమస్యలు చుట్టుముట్టడంతో ఒత్తిడితో ఆమె మద్యానికి బానిసయ్యారు. ఆ ఒత్తిడితోనే 19 నెలలు కోమాలోకి వెళ్లిపోయారు. అమ్మను అలా చూడటం నరకంలా అనిపించింది. అమ్మ మళ్లీ మామూలు మనిషి అవుతుందనుకున్నాం. కానీ మా ఆశలపై నీళ్లు చల్లుతూ ఆమ్మ వెళ్లిపోయారు అని విజయచాముండేశ్వరి ఆవేదన వ్యక్తం చేసారు.
అమ్మతో విబేధాలు ఉన్నప్పటికీ అమ్మను బెడ్ మీద చూసి నాన్న చలించిపోయారు, ఆయన ఎంతో మనోవేదన అనుభవించారు అని విజయ చాముండేశ్వరి అప్పటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
అమ్మ ఆస్తులు పొగొట్టుకున్నారని, చివరి రోజుల్లో పేదరికం అనుభవించారని ఉన్న కథనాల్లో నిజం లేదని చాముండేశ్వరి తెలిపారు. అమ్మ చనిపోయాక కూడా తాము ఎలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేదని, అమ్మ ఎంత పోగొట్టుకున్నా, అంతకంటే ఎక్కువే సంపాదించారని తెలిపారు.
అమ్మ జీవితంపై బయోపిక్ తీస్తామని నా దగ్గరకు వచ్చిన దర్శక నిర్మాతలకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చాను. మొత్తం స్క్రిప్టు చదవాలనేది నా మొదటి షరతు, తెరపై పాజిటివ్ విషయాలను మాత్రమే చూపించాలి అనేది మరో షరతు, తన తల్లి నటిగా ఎదిగిన విధానం భావి తరాలకు తెలియానే ఉద్దేశ్యంతోనే ఒప్పుకున్నట్లు చెప్పారు చాముండేశ్వరి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి