క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఉపాధి, తిండి దొరుకుతుంది

First Published 25, Apr 2018, 10:02 AM IST
Saroj khan abou casting couch
Highlights

క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఉపాధి, తిండి దొరుకుతుంది

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటి నుండో వ్రేళ్ళు పెనవేసుకొని ఉన్న క్యాస్టింగ్ కౌచ్ పై వినూత్న రీతిలో పోరాడి గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీని షేక్ చేసిన ప్రముఖ నటి శ్రీరెడ్డి ఇటివల అర్ధనగ్న ప్రదర్శనతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పాపులారిటీ సాధించింది.అయితే ఈ వివాదం మీద బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ స్పందించారు.

ఆమె మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ మీద ఒక్క ఇండస్ట్రీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు .ఈ వ్యవహారం దేశంలో ఎక్కడ లేదా ..ఏమి మీ మీడియాలో లేదంటూ జర్నలిస్టులను ప్రశ్నించారు.అక్కడితో ఆగకుండా సినిమా రంగంలో క్యాస్టింగ్ కోచ్ మాములే ..దానివలన కొంతమందికి ఉపాధి దొరుకుతుంది.తిండి దొరుకుతుంది.ఇండస్ట్రీలో ఎవరు రేప్ లు చేసి వదిలిపెట్టరు ..వారికీ ఉపాధిని చూపిస్తారు ..అయితే ఇలాంటి వ్యవహారాలకు సిద్ధపడలా లేదన్నది సదరు నటీ నటుల మీద ఆధారపడి ఉంటుంది అని ఆమె అన్నారు .

loader