కమల్ మాజీ భార్య సారికకు ఉండేందుకు ఇల్లు కూడా లేని దుస్థితి!

First Published 25, Dec 2017, 1:54 AM IST
sarika kamal ex wife become homeless after her mother death
Highlights
  • 2004లో మాజీ భార్య సారికతో కమల్ విడాకులు
  • ప్రముఖ హిరోయిన్లు శృతి హాసన్, అక్షర హాసన్ లకు సారిక తల్లి
  • ప్రస్థుతం ముంబైలో ఉండేందుకు ఇల్లు కూడా లేని దుస్థితిలో సారిక

విలక్షణ నటుడు కమల్ హాసన్ తన మాజీ భార్య సారికతో 2004లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. సారిక కమల్ తో విడిపోయాక తన తల్లి వద్దే ముంబైలో నివాసముంటోంది. కమల్ సారికలకు ఇద్దరు కుమార్తెలు. ప్రముఖ హిరోయిన్స్ శృతిహాసన్, అక్షర హాసన్ లు సారిక కమల్ లకుమార్తెలే. అయితే శృతి,అక్షర ఇద్దరూ ప్రస్థుతం తండ్రి వద్దే వుంటున్నారు.

 

ఇక బాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. కమల్ హాసన్ మాజీ భార్య, నటి సారిక ప్రస్తుతం ఉండటానికి ఇల్లు కూడా లేని దుస్థితిలో ఉన్నారని వినిపిస్తోంది. సారికను మాజీ భర్త కమల్ హాసన్, కూతుళ్లు శృతి హాసన్, అక్షర హాసన్ కూడా పట్టించుకోక పోవడంతో ఆమె పరిస్థితి దయనీయంగా మారిందని తెలుస్తోంది.

 

2004లో కమల్ హాసన్‌తో విడిపోయిన తర్వాత సారిక ముంబైలోని తన పుట్టింట్లో ఉంటున్నారు. ఇటీవలే సారిక తల్లి చనిపోయింది. సారిక తల్లి తన వీలునామాలో.... ప్రస్తుతం ఆమె ఉంటున్న ఇంటితో పాటు ముంబైలోని మొత్తం ఆస్తులను వారి ఫ్యామిలీ ఫ్రెండ్ డాక్టర్ విక్రమ్ ఠాకూర్‌కు పేరున రాశారట. ఇంటిని అతడు స్వాధీనం చేసుకోవడంతో సారిక నిరాశ్రయురాలైనట్లు తెలుస్తోంది.

 

ఆమె మరణం తర్వాత సారికకు ఉండటానికి ఇల్లు కూడా లేకుండా పోయింది. విషయం గమనించిన అమీర్ ఖాన్ సాగరికకు సహాయం చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అమీర్ ఖాన్ సోదరికి సారిక బెస్ట్ ఫ్రెండ్. సారిక పరిస్థితి తెలిసి చలించిపోయిన అమీర్.. ప్రస్తుతానికి ఆమె ఉండటానికి సహాయం చేసినట్లు తెలుస్తోంది. తన ఆస్తి తనకు రావడానికి సారిక కోర్టులో పోరాడుతున్నారు.

 

మరోపక్క శృతికి ముంబైల్ ఫ్లాట్ కూడా వుందది కదా.. ఆమిర్ సాయం చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని అంతా అనుకుంటున్నారు. మరి విషయం ఎటు తేలుతుందో చూడాలి.

loader