ఆ స్టార్ హీరో కూతురు మోసం చేసిందట!

Sara Ali Khan in trouble
Highlights

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ఇబ్బందుల్లో పడ్డారు

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ఇబ్బందుల్లో పడ్డారు. ఓ కేసుకు సంబంధించి ఆమె కోర్టుకి హాజరు కానున్నారు. అసలు విషయంలోకి వస్తే.. 'సింబా' చిత్రంతో సారా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. నిజానికి ఆమె సినీ రంగ ప్రవేశం 'కేదార్ నాథ్' చిత్రంతో జరగాల్సివుంది. కానీ ఆ సినిమా దర్శకనిర్మాతలకు మధ్య గొడవలు రావడంతో మధ్యలోనే సినిమా ఆగిపోయింది.

దీంతో సారా ఆ సినిమా నుండి తప్పుకొని రోహిత్ శెట్టి తెరకెక్కిస్తోన్న 'సింబా' సినిమా కోసం డేట్స్ కేటాయించింది. ఇప్పుడు 'కేదార్ నాథ్' చిత్రానికి నిర్మాత దొరకడంతో ఆ చిత్ర దర్శకుడు అభిషేక్ కపూర్ ఆమెను షూటింగ్ లో పాల్గొనవల్సిందిగా కోరాడు. కానీ సారా మేనేజర్ మాత్రం సింబా షూటింగ్ పూర్తయిన తరువాతే ఆమె మీ షూటింగ్ లో పాల్గొంటుందని అభిషేక్ కపూర్ కు వెల్లడించాడట. 

దీంతో చిత్రబృందం సారా మీద కోర్టులో కేసు వేశారు. సైఫ్ అలీ ఖాన్ లో ఈ వివాదాన్ని కోర్టు బయటే పరిష్కరించే విధంగా ప్రయత్నాలు చేసినా.. అవి వర్కవుట్ కాలేదని తెలుస్తోంది. ఈ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టనుంది.   

loader