తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం విడుదల అవుతోంది. ఈ సినిమా టీజర్ ను దీపావళి కానుకగా గురువారం (నవంబర్ 4) విడుదల చేసారు.  


 తన కామెడీ తో అందరిని ఆకట్టుకున్న సప్తగిరి(Sapthagiri) హాస్య నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు .. అలాగే హీరోగా సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బి, వజ్రకవచధర గోవింద వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే హీరోగా సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు సాధించలేకపోయారు. సక్సెస్ కాలేకపోయాడు. అయితే తన ప్రయత్నాలు మాత్రం విరమించుకోలేదు.సప్తగిరి తాజాగా ఎయిట్(Eight) ఆనే సినిమాను చేస్తున్నాడు Sapthagiri. పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది.

స్నేహా ఉల్లాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సోనియా అగర్వాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం విడుదల అవుతోంది. Eight టీజర్ ను దీపావళి కానుకగా గురువారం (నవంబర్ 4) విడుదల చేసారు.

ఇల్యూజన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ‘ఎయిట్’ మూవీలో సప్తగిరి గెటప్ చాలా వెరైటీ గా ఉంది. జనవరి నెల్లో ఈ సినిమాను అనౌన్స్ చేయగా.. అప్పుడు రివీలైన టీజర్ ఆకట్టుకుంటోంది. ఇది సప్తగిరికి సమ్ థింగ్ స్పెషల్ మూవీ అవుతుందనిపిస్తోంది. మరి ఎయిట్ మూవీ గురించి మరిన్ని విశేషాలు తెలియాలంటే.. సినిమా విడుదలయ్యే దాకా ఎదురు చూడాల్సిందే. 

థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కామెడీకి కూడా పెద్ద పీట వేశామని.. సప్తగిరి ఇమేజ్‌కు తగ్గట్టుగానే సినిమా ఉంటుందని నిర్మాత వెల్లడించారు. సాంకేతిక బృందం: మ్యూజిక్‌: ఎన్‌.ఎస్‌. ప్ర‌సు, సినిమాటోగ్ర‌ఫీ: న‌జీర్,‌ ఎడిటింగ్‌: వ‌ంశీ, పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్, స‌హ నిర్మాత‌: ఖుషి, నిర్మాత‌: రిజ్వాన్, ద‌ర్శ‌కత్వం: సూర్యాస్.‌

also read: దివాళీ రోజు గుడ్‌న్యూస్‌ చెప్పిన ప్రభాస్‌.. `ఆదిపురుష్‌` సెట్‌లో సంబరాలు