పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి సంతోష్ శ్రీనివాస్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న సంగతి తెలియందే. సంతోష్ శ్రీనివాస్ ఓ కథని కూడా రెడీ చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టడంతో మరో సినిమా చేసే ఉద్దేశం లేదని సంతోష్ శ్రీనివాస్ తేల్చి చెప్పేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా సంతోష్ శ్రీనివాస్ మరో హీరోతో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. పవన్ కోసం కథ రెడీ చేసుకుని ఎదురుచూస్తున్న దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కు కూడా పవన్ ఈ విషయాన్ని చెప్పాడట. రాజకీయ కార్యక్రమాలతో బిజీకాబోతున్నే నేపథ్యంలో సినిమా చేసే టైం లేదని పవన్ కళ్యాణ్ సంతోష్ శ్రీనివాస్ కు చెప్పాడట.పవన్ నుంచి స్పందన రావడంతో సంతోష్ శ్రీనివాస్ మరో హీరోని వెతుక్కున్నాడు.

హీరో గోపీచంద్ తో సంతోష్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.కాకపోతే సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రం చేయబోయేది పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేసుకున్న కథతోనా లేక వేరే కథతోనా అనే విషయంలో క్లారిటీ రావలసి ఉంది.తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా మార్చ్ 18 న సంతోష్ శ్రీనివాస్, గోపీచంద్ చిత్రం ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు.