గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. మనుషుల్లో ఉండే జంతు స్వభావాన్ని, క్రూరత్వాన్ని చూపిస్తానని సందీప్ ఇదివరకే చెప్పాడు. మరి ఈ సినిమాతో సందీప్ బాలీవుడ్ లోను సెన్సేషన్ సృష్టిస్తాడేమో చూడాలి.
ప్రముఖ తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘యానిమల్’. పరిణీతి చోప్రా హీరోయిన్. అనిల్‌కపూర్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంగా తెరకెక్కనున్న ఈ చిత్రం అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లి కంటిన్యూ షెడ్యూల్స్ తో షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. మనుషుల్లో ఉండే జంతు స్వభావాన్ని, క్రూరత్వాన్ని చూపిస్తానని సందీప్ ఇదివరకే చెప్పాడు. మరి ఈ సినిమాతో సందీప్ బాలీవుడ్ లోను సెన్సేషన్ సృష్టిస్తాడేమో చూడాలి.
2023 ఆగస్టు 11న థియేటర్లలో విడుదల కానుంది. తొలుత 2022 దసరా కానుకగా విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు మనుషుల్లో మారుతున్న స్వభావాల చుట్టూ కథ సాగుతుంది. ప్రకృతిలో ఓ హీరో జంతువులా ఎలా మారాడనే ఆసక్తికర అంశాల చుట్టూ సాగేదే ‘యానిమల్’. సిద్ధార్థ్ గరిమ మాటలు సమకూర్చగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించారు. టీ సిరీస్ భూషణ్ కుమార్, భద్రకాళీ పిక్చర్స్, సినీ స్టూడియోస్ వన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అర్జున్ రెడ్డి రీమేక్‌గా.. బాలీవుడ్‌లో ‘ కబీర్ సింగ్’తో దర్శకుడిగా అడుగులు వేసిన సందీప్ మంచి హిట్ కొట్టారు. దీంతో రణ్‌బీర్ కలయికలో రాబోతున్న ఈచిత్రం పై అంచనాలు నెలకొన్నాయి.
Also read రిలీజ్ టైమ్ లో ఇదేం ట్విస్ట్: లీగల్ చిక్కుల్లో వెంకీ ‘దృశ్యం-2’ ?
సిద్ధార్థ్ గరిమ డైలాగ్స్ అందిస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం, సంతాన కృష్ణన్ రవిచంద్రన్ ఛాయాగ్రాహకుడిగా పనిచేయనున్నారు. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్.. భూషణ్ కుమార్ నిర్మాణంలోనే రూపొందుతున్న మరో చిత్రం ‘లవ్ రంజన్’లో నటిస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. రణ్‌బీర్ - అలియాభట్ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ కరోనా కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది.
Also read EMK: ఎన్టీఆర్ గెస్ట్ గా మహేష్... సర్వం సిద్ధం!
