Asianet News TeluguAsianet News Telugu

రిలీజ్ టైమ్ లో ఇదేం ట్విస్ట్: లీగల్ చిక్కుల్లో వెంకీ ‘దృశ్యం-2’ ?

ప్రపంచ వ్యాప్తంగా 240 దేశాల్లో ఉన్న ప్రైమ్ మెంబర్స్ ఈ సినిమాను చూడబోతున్నారు. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించగా.. ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Disney Hotstar to go legal against makers of Drishyam 2
Author
Hyderabad, First Published Nov 20, 2021, 10:29 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సూపర్ హిట్ మూవీ దృశ్యం సీక్వెల్‏గా వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా దృశ్యం 2. ఇందులో మీనా, నదియా, నరేష్, కృతిక, ఈస్తర్ అనిల్, సంపత్ రాజ్, పూర్ణ కీలకపాత్రలలో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా నవంబర్ 25న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‏లో స్ట్రీమింగ్ కానుంది. ప్రపంచ వ్యాప్తంగా 240 దేశాల్లో ఉన్న ప్రైమ్ మెంబర్స్ ఈ సినిమాను చూడబోతున్నారు. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించగా.. ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్పీడు చేసారు. ఈ క్రమంలో తాజాగా దృశ్యం 2 ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అయితే ఊహించని విధంగా లీగల్ సమస్యలు ఎదురుఅవుతున్నట్లు మీడియా వర్గాల సమాచారం.  హాట్ స్టార్ సంస్థ   ముందుగా తమతో డీల్ చేసుకుని.. దాన్ని క్యాన్సిల్ చేయకుండానే మధ్యలో అమేజాన్  ప్రైమ్‌కు వెళ్లిపోవడం పట్ల ఆ సంస్థ ఆగ్రహంతో ఉందని, దీనిపై లీగల్ నోటీసులు ఇచ్చిందని సమచారం.

‘దృశ్యం-2’కు సంబంధించి సురేష్ బాబుతో పాటు ఇంకో ఇద్దరు నిర్మాతలు ఉండగా.. వారిలో ఒకరు  డిస్నీ+హాట్ స్టార్  వాళ్లతో డీల్ చేసుకున్నట్లుగా చెప్తున్నారు. అయితే ఆ డీల్ సంగతి ఎటూ తేలకముందే తన ప్రొడక్షన్లో వచ్చిన మరో చిత్రం ‘నారప్ప’ సినిమాను రిలీజ్ చేసిన ప్రైమ్ వాళ్లతో సురేష్ బాబు ‘దృశ్యం-2’ విడుదలకు డీల్ కుదుర్చుకున్నట్లుగా చెబుతున్నారు. దీంతో హాట్ స్టార్ సంస్ద లీగల్ ఫైట్‌కు రెడీ అయినట్లు వినికిడి. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. 

Also read Drushyam 2 Trailer: సినిమా తీసేలోపు వెంకీకి సినిమా చూపిస్తామంటున్న పోలీసులు

ఇక చిత్రం కథ విషయానికి వస్తే... పోలీస్ ఆఫీసర్ నదియా కొడుకు హత్య కేసు అనంతరం రాంబాబు కుటుంబంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి.. నదియా కుమారుడి హత్య కేసు ఏమైంది అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. రాంబాబు సినిమా థియేటర్ కట్టుకుని హాయిగా జీవిస్తుండగా.. మళ్లీ వరుణ్ హత్యకు సంబంధించిన అంశాలను తెరపైకి తీసుకువస్తారు పోలీసులు. ఇక దృశ్యం 2 ట్రైలర్ ఆద్యంతం థ్రిల్లింగ్ సస్పెన్స్‏తో సాగిపోయింది. ఆరేళ్ల తరువాత రాంబాబు జీవితంలో మళ్లీ ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి.. కేస్ ఇన్వెస్టిగేషన్ ఎలా మలుపు తిరిగింది.. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు రాంబాబు ఎలాంటి ఎత్తులు వేశాడు? ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? కథలో ప్రతీ మలుపు అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios