పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సినిమాల పరంగా, రాజకీయాల పరంగా ఎందరో అభిమానులు ఉన్నారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సినిమాల పరంగా, రాజకీయాల పరంగా ఎందరో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం 'జనసేన' పార్టీను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో పవన్ తలమునకలై ఉన్నాడు. వచ్చే ఏడాది ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఆయన గెలవాలని అభిమానులతో పాటు సినీ తారలు సైతం కోరుకుంటున్నారు.

మెగాఫ్యామిలీ హీరోలందరూ పవన్ ఎప్పుడు పిలుస్తాడా..? ప్రచారం ఎప్పుడు చేయాలా అని ఆతురతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ డైరెక్టర్ పవన్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఆయనేంటో నిరూపించుకుంటాడు అంటూ ప్రజలను కోరుతున్నాడు. 'అర్జున్ రెడ్డి' చిత్రంతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పవన్ గురించి తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. 

''ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారికి ఒక నాయకుడు నిజమైన మన తెలుగు సైనికుడికి నీకోసం ప్రాణం సైతం లెక్క చేయని జవాన్‌లా నిలబడే వాడికి, ఒక సామాన్యుడికి, రాజకీయ వారసత్వం లేని వాడికి మన తెలుగు రాష్ట్రాన్ని పాలించే అవకాశం ఇవ్వండి. ఈ తెలుగోడి గురించి తెల్లోడు మాట్లాడుకునేలా చేస్తాడు పవన్ కల్యాణ్'' అంటూ పేర్కొన్నారు. 

Scroll to load tweet…