సినీ నటి సన తన నట జీవితంలో ఎదుర్కొన్న కష్ట నష్టాలను ఓ షోలో వెల్లడించారు. బుల్లితెరపై తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె వెండితెరకు షిఫ్టై మంచి ప్రస్థానాన్ని కొనసాగించారు. ప్రతి నటి లేదంటే నటుడి జీవితంలో కొన్ని దురదృష్టకర సంఘటనలు ఉంటాయి. అలాగే సన జీవితంలో కూడా కొన్ని అలాంటి పరిస్థితులను ఫేస్ చేసిందట. టాలీవుడ్‌లో అయితే పెద్దగా ఆమె ప్రాబ్లమ్స్ ఏమీ ఫేస్ చేయలేదు కానీ కన్నడలో మాత్రం ఓ సినిమా విషయంలో చాలా ఇబ్బందిపడిందట. తను పడిన బాధను ఆమె ఓ షోలో వెల్లడించారు.
 
తెలుగు ఇండస్ట్రీలోకి కొత్తవారు ఎవరు వచ్చినా వారిని అక్కున చేర్చుకుంటామని.. తమిళ్‌, మలయాళంలో కూడా పెద్దగా పట్టించుకోరని సన తెలిపారు.. కానీ కన్నడలో మాత్రం అలాంటి వాతావరణం కనిపించదన్నారు. కన్నడలో ఆమె నటించిన రెండు మూడు సినిమాలు మంచి హిట్‌ కావడంతో సెంటిమెంట్‌గా ఓ సినిమాలో హీరో సోదరి పాత్ర కోసం సనను తీసుకున్నారట. అక్కడున్న ఓ దర్శకుడు మొదటి రోజు నుంచీ ఆమె పట్ల కోపం ప్రదర్శించేవారట.
 
ఒక షాట్‌లో తాను పేజీ డైలాగ్‌ చెప్పాలట. దాన్ని ఆ డైరెక్టర్ సింగిల్‌ టేక్‌లో చెప్పాలని ఆదేశించారట. నో ప్రామ్టింగ్ అంటూ సనపై ఒత్తిడి చేశారట. సరేనని ఆమె కూడా రెడీ అయిపోయారట. కానీ తాను సీన్‌ చేసిన తర్వాత ‘ఏం మాట్లాడుతున్నారు. ఇది అసలు భాషేనా! మీరు అసలు పదాలు సరిగా పలకలేదు’ అంటూ అరిచేసేవారట. అప్పటికి మధ్యాహ్నం ఒంటి గంటన్నర అయిందట. ఎన్నిసార్లు డైలాగ్ చెప్పినా ఇంకో టేక్‌.. ఇంకో టేక్‌ అనేవాడట. చివరకు తనపై అరిచేసి షూటింగ్‌కు బ్రేక్‌ చెప్పేసి వెళ్లిపోయాడట. దీంతో సనకు కన్నీళ్లు ఆగలేదట. ఆ మధ్యాహ్నం అంతా ఏడుస్తూనే ఉన్నానని... తన అది జీవితంలో మర్చిపోలేని ఘటనగా సన అభివర్ణించింది.