కన్నడలో 'కిరిక్ పార్టీ' చిత్రంతో పేరు తెచ్చుకున్న సంయుక్త హెగ్డే తెలుగులో ఆ సినిమా రీమేక్ గా రూపొందించిన 'కిరాక్ పార్టీ'తో హీరోయిన్ గా పరిచయమైంది. కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

దీంతో సంయుక్తకు తెలుగులో అవకాశాలు రాలేదు. కానీ తన హాట్ ఫొటోస్ తో అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా మరో హాట్ షూట్ లో పాల్గొంది ఈ బ్యూటీ. ఈ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. యాక్టింగ్ తో పాటు సంయుక్తకు డాన్స్ అంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఫ్లాష్ మాబ్స్ లో కూడా పాల్గొంటూ ఉంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కన్నడలో ఓ సినిమా సైన్ చేసినట్లు సమాచారం.