యాక్షన్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ మరో ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తేవడానికి సిద్దమయ్యాడు. ప్రస్తుతం గోపి చాణక్య సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఆ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. దసరా కానుకగా అక్టోబర్ మొదటివారంలో ఈ స్పై థ్రిల్లర్ ని రిలీజ్ చేయనున్నారు. 

అయితే ఆ సినిమా అనంతరం గోపి రెండు ప్రాజెక్టులతో బిజీ కానున్నాడు. ఇటీవల బివిఎస్ఎన్.ప్రసాద్ తో ఒక కథను స్టార్ట్ చేసిన గోపి త్వరలో సంపత్ నంది డైరెక్షన్ లో కూడా మరో ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయనున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా భారీ బడ్జెట్ తో గోపీచంద్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యూ టర్న్ నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ఈ బిగ్ బడ్జెట్ సినిమాను నిర్మించనున్నారు. 

ఇక సంపత్ నంది డైరెక్షన్ లో ఇదివరకే గోపీచంద్ గౌతమ్ నందా సినిమాను తెరకెక్కించాడు. 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా అనుకున్నంతగా విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని వీరు సిద్ధమయ్యారు. చాణక్య రిలీజ్ అనంతరం గోపి సంపత్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తేనున్నాడు.